Begin typing your search above and press return to search.
ప్రభాస్ 'రాముడు' అయితే.. మరి 'రావణుడు'...
By: Tupaki Desk | 20 Aug 2020 2:30 AM GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసపెట్టి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నాడు. 'బాహుబలి'తో వచ్చిన ఇమేజ్ ని నిలబెట్టుకునే క్రమంలో లేటెస్టుగా స్ట్రెయిట్ బాలీవుడ్ మూవీలో నటించడానికి రెడీ అయ్యాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్న ఈ చిత్రానికి ''ఆది పురుష్'' అనే టైటిల్ ఖరారు చేశారు. 'చెడుపై మంచి సాధించిన విజయం' అనే థీమ్ తో ఈ మూవీ టైటిల్ కి సంబంధించిన మోషన్ పోస్టర్ విడుదల చేశాడు ప్రభాస్. ఈ పోస్టర్ లో రాముడు విల్లు ఎక్కుపెట్టినట్లుగా.. పది తలల రావణుడు.. గదతో దూసుకొస్తున్న హనుమంతుడు.. మునులు చిత్రాలు.. ఇలా ఇతిహాసగాథ రామాయణాన్ని తలపించేలా డిజైన్ చేయబడి ఉంది. దీంతో బాహుబలి ఇప్పుడు 'రాముడి' అవతారం ఎత్తబోతున్నాడని అందరూ ఫిక్స్ అయిపోయారు. దీనికి తోడు నాగ్ అశ్విన్ ట్వీట్ చేస్తూ.. 'ప్రభాస్ ని తెరపై రాముడిలా చూడబోతుండడం ఎగ్జైటింగ్ గా ఉంది. గతంలో కొంతమంది నటులు మాత్రమే ఆ పాత్రను చేయగలిగారు' అని పేర్కొన్నాడు. ఈ ట్వీట్ తో ప్రభాస్ రాముడు అని సినీ అభిమానులు కంఫర్మ్ చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ సినిమాలో ప్రతినాయకుడు రావణుడుగా ఎవరు నటించబోతున్నారనే డిస్కషన్ స్టార్ట్ అయింది.
కాగా 'ఆది పురుష్' లో ప్రధాన ప్రతినాయకుడి పాత్ర కోసం మేకర్స్ స్టార్ హీరోలను సంప్రదిస్తున్నారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ కి విలన్ గా పలువురు స్టార్ హీరోల పేర్లను సూచిస్తున్నారు. ఓమ్ రౌత్ గత చిత్రం 'తన్హాజీ'లో హీరోగా నటించిన అజయ్ దేవగన్ అయితే రావణాసుడుగా బాగుంటాడని అంటున్నారు. 'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెడుతున్న అజయ్ దేవగన్ అయితే మార్కెట్ పరంగా కూడా వర్కౌట్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు స్టార్ హీరో అక్షయ్ కుమార్ అయితే ప్రభాస్ కి ధీటుగా ఉంటాడని కామెంట్స్ చేస్తున్నారు. రజినీకాంత్ '2.0'లో ప్రతినాయకుడిగా నటించిన అక్షయ్ ని రావణాసురుడి పాత్ర కోసం తీసుకొని సూచిస్తున్నారు. ఇంకొందరైతే సూపర్ స్టార్ రజినీకాంత్ అయితే రావణుడుగా సూట్ అవుతాడంటా ఏకంగా పది తలల రజినీకాంత్ పోస్టర్ డిజైన్స్ చేస్తున్నారు. అంతేకాకుండా 'బాహుబలి'కి సమానమైన భల్లాలదేవుడుగా కనిపించిన రానా దగ్గుబాటి నే 'ఆది పురుష్'లో రిపీట్ చేయమని సలహా ఇస్తున్నారు. ఇక రియల్ శ్రీమంతుడు సోనూసూద్ ని విలన్ గా తీసుకోమని పలువురు సూచిస్తున్నారు. కొంతమంది డై హార్డ్ ఫ్యాన్స్ మాత్రం 'రావణుడు'గా కూడా ప్రభాస్ నటిస్తే మూవీ నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని అంటున్నారు. మొత్తం మీద ఈ సినిమాలో కీలకమైన విలన్ రోల్ కోసం మేకర్స్ ఎవరిని తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉండగా 3-డీ ఫార్మాట్ లో విజువల్ వండర్ గా రూపొందించనున్న 'ఆదిపురుష్' చిత్రాన్ని 2021 లో సెట్స్ పైకి తీసువెళ్లి.. 2022లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని టీ - సిరీస్ భూషణ్ కుమార్ - కృష్ణ కుమార్ - ప్రసాద్ సుతార్ - రాజేష్ నాయర్ - ఓం రౌత్ లు కలిసి భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'ఆది పురుష్'ని తెలుగు హిందీ భాషల్లో నిర్మించి తమిళం - మలయాళం - కన్నడ భాషలలో పాటు అనేక విదేశీ భాషల్లోకి కూడా అనువదించనున్నారని తెలుస్తోంది.