Begin typing your search above and press return to search.
ఎవ్వరికీ సపోర్టు చేయననడం బూతు కాదా??
By: Tupaki Desk | 23 March 2017 10:49 AM GMTడెమోక్రసీ అంటే ఎవరికి వారికి ఒపీనియన్ ఉంటుంది.. దానిని వారు ఎవ్వరితోనైనా ఎక్కడైనా నిస్సంకోచంగా చెప్పుకోవచ్చు. అందుకని ఒక పేరొందిన సెలబ్రిటీ తనకు పట్టనట్లే వ్యవహరిస్తే మాత్రం అది చట్టబద్దంగా కరక్టేమో కాని నైతికంగా మాత్రం బూతే అని చెప్పాలి.
ఈరోజు ఉదయం సడన్ గా రజనీకాంత్ దగ్గర నుండి ఒక ట్వీట్ వచ్చిన సంగతి తెలిసిందే. ''నేను ఎవ్వరికీ సపోర్టు చేయట్లేదు'' అంటూ ఆయన ఒక ట్వీట్ వేసిపాడేశారు. అసలే సూపర్ స్టార్ కాబట్టి ఆయన నేను పలానా వ్యక్తికి సపోర్టు చేస్తున్నా అని చెబితే మాత్రం పెద్ద రచ్చ జరుగుతుంది. అందుకే ఆయన తమిళనాట ఆర్.కె.నగర్ లో జరుగుతున్న ఉప ఎన్నికను ఉద్దేశించి అలా చెప్పుంటారు. కాకపోతే రజనీ వంటి వ్యక్తి ఒక సోషల్ మీడియా ద్వారా ఇలా చెప్పడం బూతు కాదా? న్యాయంగా మీ మనస్సుకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోండనో.. లేదంటే మీ శ్రేయస్సు కోసం కష్టపడే శ్రామికుడ్ని ఎన్నుకోమనో చెప్పాలి కాని.. ఇలా నేను ఎవ్వరికీ సపోర్టు చేయట్లేదు.. అంటూ ట్వీటేస్తే.. సూపర్ స్టార్ రేంజ్ కు అది సరితూగుతుందా?
ఆల్రెడీ వయస్సు 60 పైనే.. రేంజ్ ఏమో సాక్షాత్తూ సగం దేవుడు అన్నట్లు జనాలు కొలుస్తుంటారు.. అటువంటి ఒక ప్రముఖ సూపర్ స్టార్ కూడా.. రాజకీయాలను ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేయిస్తే బాగుంటుంది అని సూచించాల్సింది పోయి.. కేవలం చేతులు దలుపుకుంటుంటే.. ఇన్నేళ్లూ మనం చూపించిన అభిమానానికి ఆయన చేసే న్యాయం ఇదేనా అనిపిస్తోంది కదూ? ఏదేమైనా కూడా రజనీ రాజకీయ స్వేఛ్చ రజనీ ఇష్టం. మనమేం చెప్తాం!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/