Begin typing your search above and press return to search.
లేడీ 'ఘోస్ట్' విషయంలో చర్చోపచర్చలు
By: Tupaki Desk | 18 Nov 2021 7:45 AM GMTసీనియర్ హీరోలకు ఈమద్య కాలంలో హీరోయిన్స్ సమస్య చాలా కామన్ అయ్యింది. బాలయ్యను మొదలుకుని నాగ్.. చిరంజీవి.. వెంకీ ఇలా ప్రతి ఒక్కరికి కూడా హీరోయిన్ సెట్ చేయడం కోసం దర్శకులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వీరి స్టార్ డమ్ కు కొత్త వారిని స్టార్ డమ్ లేని వారిని నటింపజేయడం బాగుండదు.. అలా అని కొత్త వారిని తీసుకుంటే మరీ చిన్న వయసు వారు ఉంటారు.
కొందరు సీనియర్ హీరోయిన్స్ ఉన్నా కూడా వారు ఏవో కారణాల వల్ల నో చెప్పడంతో హీరోయిన్స్ వెదికే పక్రియ చాలా ఇబ్బందిగా మారింది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు ఈ పరిస్థితి నాగార్జునకు మళ్లీ వచ్చిందంటూ ప్రచారం జరుగుతోంది. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ఘోస్ట్ అనే సినిమాను నాగార్జున చేస్తున్న విషయం తెల్సిందే.
ఈ సినిమా కు మొదట కాజల్ ను హీరోయిన్ గా అనుకున్నారు. షూటింగ్ ఆలస్యం అవ్వడంతో పాటు ఇతర కారణాల వల్ల సినిమా నుండి ఆమె తప్పుకున్నట్లుగా ప్రకటించింది. నాగార్జున తప్పుకోవడంతో పలువురు హీరోయిన్స్ పేర్లను పరిశీలించి నాగార్జున స్టార్ డమ్ కు మరియు పాత్రకు తగ్గట్లుగా అమలా పాల్ ఉంటుందనే అభిప్రాయంకు వచ్చారు.
నాగ్ కూడా ఆమె అయితే బాగుంటుందనే భావించాడట. ఆమెను ఈ సినిమా కోసం సంప్రదించగా ఏకంగా కోటి రూపాయల పారితోషికంను డిమాండ్ చేసింది. కనీసం 50 లక్షల మార్కెట్ కూడా లేని ఆమెకు కోటి రూపాయల పారితోషికం మరీ ఎక్కువ అంటూ మేకర్స్ ఆమె ను వద్దనుకున్నట్లుగా తెలుస్తోంది.
అమలా పాల్ కాకుండా ఇలియానా ను కూడా ఈ సినిమా కోసం అనుకున్నారట. కాని కొన్ని యాక్షన్ సన్నివేశాలు ఉండటం వల్ల ఆమెకు అవి సెట్ అవ్వవు అనే ఉద్దేశ్యంతో ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇక త్రిష కూడా ఈ సినిమా కు హీరోయిన్ గా పరిశీలించబడుతుందని అంటున్నారు.
వీరు మాత్రమే కాకుండా ఇంకా కొందరు సీనియర్ హీరోయిన్స్ ను మరియు ప్రస్తుతం ఫామ్ లో ఉన్న స్టార్ హీరోయిన్స్ ను కూడా ఘోస్ట్ కోసం పరిశీలిస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికే ఒక షెడ్యూల్ ను ముగించారు.
తదుపరి షెడ్యూల్ ప్రారంభం వరకు లేడీ ఘోస్ట్ ను ఎంపిక చేయాల్సి ఉంది. ప్రస్తుతం దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ సినిమా కు సెట్ అయ్యే హీరోయిన్ వేటలోనే ఉన్నాడు. బాలీవుడ్ ముద్దుగుమ్మలను కూడా పరిశీలిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.