Begin typing your search above and press return to search.
అంబానీ ఈవెంట్లో పటానీ మెరుపులు ఉరుములు
By: Tupaki Desk | 2 April 2023 11:27 AM GMTమిసమిస మెరుపుల మెహబూబా కసి కసి తలపుల దిల్ రూబా...! ఇంతకీ ఎవరీ మెహబూబా ? అంటే ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. చంద్రబోస్ లిరిక్ లో దిల్ రూబా తెలుగు యూత్ అందరికీ తెలిసిన `లోఫర్ బ్యూటీ` దిశా పటానీ. పటానీ అని పిలిచే కంటే సీకే బ్యూటీ అని పిలిస్తే వెంటనే గుర్తు పట్టేస్తారు. అంతగా కెల్విన్ క్లెయిన్ బ్రాండ్ ప్రమోటర్ గా ప్రజల గుండెల్లో నిలిచిపోయింది దిశా పటానీ. ఈ బ్యూటీ నిరంతర ఫోటోషూట్లు యువతరనికి స్పెషల్ ట్రీట్ గా నిలుస్తున్నాయి.
దిశా ఏ ఈవెంట్లో కనిపించినా అక్కడ తనే షో స్టాపర్ గా నిలుస్తుంది. శనివారం రాత్రి ముంబైలోని ఫ్యాషన్ గాలాకు వచ్చిన దిశా స్ట్రాప్ లెస్ బ్రాతో ఆకర్షణీయమైన వెండి మెరుపుల చీరతో మతులు చెడగొట్టింది. డాంగ్లర్ ఛమ్కీలతో బీచ్ వేవ్ ని తలపించేలా తన హెయిర్ ని స్టైలింగ్ చేసింది. ఈ ఈవెంట్ ఆద్యంతం దిశా పటానీ పైనే కళ్లన్నీ వాలిపోయాయి. నిరంతర ఫోటోషూట్లతో అలరించే దిశా ఈసారి చీరలో తళుకుబెళుకులు ప్రదర్శించిన తీరు మిరుమిట్లు గొలిపింది. మునుపటి కంటే టూ హాట్ లుక్ లో కనిపించింది.
ఇంతకుముందు ఆఫ్-వైట్ లోదుస్తులతో తన టోన్డ్ ఫిగర్ ను ప్రదర్శిస్తూ మెరిపించిన ఈ బ్యూటీ ఇంతలోనే మెరుపులు మిరుమిట్ల చీరలో ప్రత్యక్షమై మతులు చెడగొట్టింది. హాట్ దిశా షేర్ చేసిన ఫోటోలు వెంటనే సోషల్ మీడియాల్లో వైరల్ గా మారాయి. చాలా మంది అభిమానులు ప్రేమతో కూడిన ఎమోజీలు షేర్ చేస్తూ అభిమానం కురిపించారు.
దిశా మైక్రో-బ్లాగింగ్ సైట్ లో నిరంతర ట్రీట్ గురించి చెప్పాల్సిన పని లేదు. వరుసగా వేడెక్కించే బాడీ హగ్గింగ్ దుస్తుల్లో చెలరేగుతూ ఇన్ స్టాలో దిశా భారీ ఫాలోవర్స్ ని సంపాదించింది. మరోవైపు సినీకెరీర్ పరంగా ఎదురే లేకుండా ముందుకు సాగుతోంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. దిశా చివరిగా ఏక్ విలన్ రిటర్న్స్ లో నటించింది. అర్జున్ కపూర్- జాన్ అబ్రహం - తారా సుతారియాలతో స్క్రీన్ స్పేస్ ను షేర్ చేసుకుంది. తదుపరి సాగర్ అంబ్రే- పుష్కర్ ఓజా దర్శకత్వం వహిస్తున్న యోధాలో సిద్ధార్థ్ మల్హోత్రా - రాశి ఖన్నాతో కలిసి నటించనుంది. ప్రాజెక్ట్ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. 7 జూలై 2023న విడుదల కానుంది.
దిశా లోఫర్ చిత్రంతో టాలీవుడ్ లో బిగ్ ఫ్లాప్ అందుకుంది. పూరి లాంటి కమర్షియల్ డైరెక్టర్ ఆశించిన హిట్టు ఇవ్వలేకపోయాడు. ఆ తర్వాత దిశా టాలీవుడ్ లో నటించలేదు. చాలా కాలం తర్వాత ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ప్రాజెక్ట్ K తో టాలీవుడ్ లో ఘనమైన రీఎంట్రీ ఇవ్వాలని తహతహలాడుతోంది. ఇంకా టైటిల్ నిర్ణయించని మరో సౌత్ సినిమాలో దిశా పటానీ నటిస్తోంది. కథానాయికగానే కాకుండా జెన్ జెడ్ యూత్ లో దిశాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా వాణిజ్య ప్రకటనలతోను భారీగా ఆర్జిస్తోంది ఈ బ్యూటీ.