Begin typing your search above and press return to search.
కలిసి తిరిగితే... డేటింగేనా?
By: Tupaki Desk | 27 March 2018 8:06 AM GMTదిశా పటానీ ఎక్కడికెళ్లినా వెనక తోకలా బాడీగార్డ్ కమ్ బాయ్ఫ్రెండ్లా టైగర్ ష్రాఫ్ కనిపిస్తాడు. టైగర్ పక్కన లేకుండా దిశా పటానీని బయట చూడడమూ కష్టమే. అంతలా ఎక్కడికెళ్లినా జంటగా వెళ్లే ఈ జంట, తమ మధ్య స్నేహం తప్ప... ప్రేమ లేదని చెబుతోంది. కలిసి తిరిగినంత మాత్రాన డేటింగ్ చేస్తున్నారని... ఎలా అనేస్తారని నిలదీసి అడుగుతున్నారు.
పూరీజగన్నాథ్ - వరుణ్ తేజ్ కాంబినేషన్లో వచ్చిన లోఫర్ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది యూపీ మోడల్ దిశా పటానీ. అందులో బాగానే అందాలు చూపించినా, ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో బాలీవుడ్ చెక్కేసిందీ బ్యూటీ. అక్కడ బేఫ్రికే అనే వీడియో ఆల్బమ్ షూటింగ్లో హీరో టైగర్ ష్రాప్ కలిశాడు. ఇద్దరి మధ్య బంధం బలంగా ఏర్పడింది. దిశా పటానీ ర్యాంపు వాక్ లకి వెళ్లినా, వెనక టైగర్ ఉండేవాడు. ఓ సారి ర్యాంపు వ్యాక్ చేసే ఫ్లోర్ అద్దంలా డిజైన్ చేయడంతో.. దిశాని హెచ్చరించి ఆమె పరువు పోకుండా కాపాడాడు కూడా. దాంతో పిల్ల, ఏకంగా టైగర్ ష్రాప్ హీరోగా నటించే సినిమాల్లోనే నటిస్తానని చెబుతోందని టాక్ కూడా వినిపించింది.
ఇప్పుడు ఇద్దరూ కలిసి భాగీ2 అనే చిత్రంలో నటించారు. తెలుగు క్షణం సినిమాకి రిమేక్ గా వస్తున్న ఈ చిత్రం - మార్చి 30న విడుదలవుతోంది. ఈ చిత్ర ప్రమోషన్ లో పాల్గొన్న ఈ జంట - మా మధ్య ప్రేమ లేదు. కేవలం స్నేహం మాత్రమే అని నొక్కి వక్కానిస్తోంది. అయితే ఇన్ని రోజులు చెట్టాపట్టేలుసుకుని తిరిగి, ఇప్పుడు జస్ట్ ఫ్రెండ్స్ అంటే మాత్రం నమ్మేస్తామా... అంటూ నవ్వేస్తున్నారు నెటిజన్లు.