Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: అందంతో పఠాయించేసిందిగా

By:  Tupaki Desk   |   20 Dec 2016 5:42 AM GMT
ఫోటో స్టోరి: అందంతో పఠాయించేసిందిగా
X
కాస్త పద్దతిగా ఉండే హీరోయిన్సే అవార్డ్ ఫంక్షన్స్ అంటే ఎక్కడలేని అందాలు ఆరబోస్తారు అలాంటిది చిన్న అవకాశమొచ్చినా చెలరేగి పోయే హీరోయిన్స్ ఇంకెంత హడావుడి చేయాలి. అదే జరిగింది రీసెంట్ గా జరిగిన ఓ అవార్డ్స్ ఫంక్షన్లో. ఎవరికి తోచిన రీతిలో వారు గ్లామ్ షో చేశారు. అయితే కొంతమంది హీరోయిన్స్ మాత్రం సింపుల్ గా వచ్చి హద్దుల్లో ఉంటూనే అటెన్షన్ తమ మీద పడేలా చేసుకొన్నారు. అలాంటి వాళ్లలో హాట్ హీరోయిన్ దిశా పఠానీ కూడా ఉంది.

టాలీవుడ్ కి దిశా పఠానీ అంటే పూరీ మూవీ లోఫర్ సినిమాలో విచ్చలవిడిగా అందాలు ఆరబోసిన హీరోయిన్ గానే గుర్తు. కానీ బాలీవుడ్లో దిశా అంతకుమించిన ఐడెంటెటీ తెచ్చుకొంది. సూపర్ మోడల్ గా.. ఆల్బమ్స్ లో యాక్ట్ చేసిన అందగత్తెగానే కాదు.. రీసెంట్ గా వచ్చి బ్లాక్ బస్టరైన ఎంఎస్ ధోనీ బయోపిక్ లో నటిగానూ మంచి మార్కులే కొట్టేసింది. అందుకే ఇప్పుడు బాలీవుడ్లో చాలామంది దర్శక నిర్మాతలు దిశా మీద ఫోకస్ పెట్టారు. ఇక రీసెంట్ గా జరిగిన ఓ అవార్డ్స్ ఫంక్షన్లో తళుక్కుమంది దిశాపఠానీ.

మాములుగా అయితే గ్లామర్ షో విషయంలో ఎక్కడా తగ్గదు ఈ అందగత్తె. కానీ అవార్డ్స్ ఫంక్షన్లో మాత్రం అస్సలు గీత దాటలేదు. అలాగని పూర్తిగా డల్ లుక్ లో ఏమీ రాలేదు. కావల్సినవి కవర్ చేస్తూనే కావాల్సిన కలరింగ్ ఇచ్చింది. హాఫ్ వైట్ లో.. కట్ స్లీవ్ లెస్ టాప్.. సేమ్ కలర్ లో వెయిస్ట్ బాటమ్ తో సింపుల్ గా వచ్చిన దిశా అందర్ని ఆకట్టుకొంది. అంతేనా ఎంఎస్ ధోనీలో నటనకి గానూ అవార్డ్ కూడా గెల్చుకొంది. అసలే టాలీవుడ్లో హీరోయిన్స్ కొరత మరీ మనోళ్లు మళ్లీ ఏమన్నా దిశా కోసం ప్రయత్నాలు చేస్తారేమో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/