Begin typing your search above and press return to search.
వాళ్ళను ను కోతిలా గెంతమంటున్న హృతిక్
By: Tupaki Desk | 29 Aug 2018 10:48 AM GMTగాసిప్ లు మంచివా కావా? ఆ సంగతి తెలీదు కానీ ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరచనంతవరకూ వాటితో పెద్దగా ఇబ్బంది ఉండదు. అంతెందుకు అసలు మీమీద గాసిప్ రాయాలంటే మీరు సెలబ్రిటీ అయి ఉండాలి. లేకపోతే ఒక్కడూ పట్టించుకోడు. మరి హృతిక్ రోషన్ అలా కాదు కదా.. బాలీవుడ్ గ్రీక్ గాడ్. మరి రూమర్లు.. గాసిప్ లు రాకుండా ఉంటాయా?
వస్తాయి.. రీసెంట్ ఒక గాసిప్ వచ్చింది. దాన్ని రెండు వాక్యాల్లో చెప్తే "హృతిక్ దిశా పతాని వెంట పడుతున్నాడు. ఊరికే డేటింగ్ కి రమ్మని మెసేజిలతో సతాయిస్తూ ఉంటే హృతిక్ తో చేయాల్సిన ఒక కొత్త సినిమా ఆఫర్ ను దిశా పతాని వదులుకుంది." ఇక ఈ గాసిప్ చూసిన దిశా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక పెద్ద మెసేజ్ పెట్టింది. "నాకు - హృతిక్ సార్ కు సంబంధించి క చెత్త గాసిప్ చక్కర్లు కొడుతోంది. అదంతా ఒట్టి అబద్ధం అన్ని స్పష్టం చేయదలుచుకున్నాను. నాకు హృతిక్ తో ఉన్న కొద్దిపాటి పరిచయంతో అయన గొప్ప మర్యాదస్తుడని.. సంతోషంగా ఉంటూ అందర్నీ సంతోషం గా ఉంచే వ్యక్తి అని చెప్పగలను. అయనపై నాకున్న గౌరవమే ఈ చెత్త గాసిప్ కు కూడా స్పందించేలా చేసింది. నేను ఏ ప్రాజెక్ట్ నుండి బయటకు రాలేదు."
మరోవైపు హృతిక్ కూడా ఘాటుగా స్పందించాడు. ట్విట్టర్ లో మీడియా క్లిప్పింగ్స్ పోస్ట్ చేసి "నా ప్రియమైన పత్రికా జీ(ఆ మీడియా పేరు). మీరు కసరత్తులు చేస్తారా? ఎక్సర్ సైజులు చేస్తే మైండ్ లో ఉండే చెత్త అంతా బయటకు పోతుంది.. ముఖ్యంగా 20 గాడిద కిక్కులు - 20 కోతి పల్టీలు - 20 కుక్క గెంతులు కనుక చేస్తే శరీరంలో ఉన్న మలినాలన్నీ ఒక్క దెబ్బకు మటాష్. తప్పకుండా ప్రయత్నించండి. గుడ్ లక్.. గుడ్ డే.. లవ్ యూ టూ"
మరో ట్వీట్ లో "భాస్కర్ భాయిసాబ్(దైనిక్ భాస్కర్ న్యూస్ పేపర్) ఎలా ఉన్నారు? అంతా కుశలమే కదా. మీ వ్యాపారం విస్తరించుకోవడానికి నా వైపు నుండి ఈ ట్వీట్. ఈ సారి మాత్రం నా హెల్ప్ కావాలని డైరెక్ట్ గా అడగండి."
సహజంగా స్టార్లు మీడియా పేర్లను ప్రస్తావించకుండా ఇలా ఫైర్ అవుతారు.. ఈసారి హృతిక్ కు బాగా మండినట్టుంది. అందుకే పేర్లు చెప్పి మరీ సెటైర్ల తో విరుచుకుపడ్డాడు!