Begin typing your search above and press return to search.

స‌ముద్రంపై ఆక్వా ఉమెన్ లా దండెత్తిన బికినీ బేబ్

By:  Tupaki Desk   |   29 Dec 2020 4:43 PM GMT
స‌ముద్రంపై ఆక్వా ఉమెన్ లా దండెత్తిన బికినీ బేబ్
X
బికినీ బీచ్ లో చెల‌రేగాలంటే దిశా ప‌టానీ త‌ర్వాత‌నే. మ‌లైకా.. ఇషా గుప్తా లాంటి అరుదైన తార‌ల త‌ర్వాత దిశా ప‌టానీ నే ఆ వేవ్ ని కొన‌సాగించ‌గ‌ల స‌మ‌ర్థురాలని నిరూప‌ణ అయ్యింది. ఇటీవ‌ల భామ‌లంతా మాల్దీవుల్లో వ‌రుస‌గా బికినీలు ధ‌రించి ట్రీటిస్తే ఎందుక‌నో దిశా మాత్రం అప్పుడు మిస్స‌య్యింది.

అందుకేనేమో.. ఇప్పుడు ఏకంగా ఇదిగో ఇలా ప‌సుపు రంగు బికినీలో న‌డి స‌ముద్రం లోకి వెళ్లిపోయింది. అక్క‌డి నుంచి హాటెస్ట్ బికినీ ఫోటోని అంత‌ర్జాలంలోకి రివీల్ చేసింది. అక్కడ ఉవ్వెత్తున ఎగ‌సిప‌డే స‌ముద్ర‌పు కెర‌టాల‌తో పోటీప‌డుతూ దిశా ప‌టానీ స‌ర్ఫింగ్ చేసింద‌ట‌. ఒక ర‌కంగా ఆక్వా ఉమెన్ గా మారిందంటూ అభిమానులు కామెంట్ల‌తో చెల‌రేగిపోతున్నారు.

ఇన్ స్టాలో దిశా వ‌రుస ఫోటోలు మంట‌లు పెడుతున్నాయి. సంవత్సరం ముగింపు లో ఇలా బికినీ బీచ్ లో సేద దీరుతోంది ఈ భామ‌. త‌న హాలీడే జాలీడే ట్రిప్ నుంచి హీటెక్కించే వీడియోను సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేసింది.

ఇంత‌కీ ఇది ఏ బీచ్ గోవానా? అంటే కానేకాదు. ఈసారి సెలవు కోసం ఎవ‌రికీ తెలియని సీక్రెట్ బీచ్ ప్రదేశానికి వెళ్లింద‌ట‌. అప్పటి నుండి దిశా సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తూ తన అభిమానులను విస్మయానికి గురిచేస్తోంది. బీచ్ వద్ద తన ఆహ్లాదకరమైన నైట్ పార్టీ ఫోటోలు స‌హా ఇసుకలో .. ఎండలో షికార్ల‌ను ఫోటోల రూపంలో అభిమానులకు షేర్ చేసి ఆటపట్టిస్తోంది.

మంగళవారం నాడు ఏకంగా పసుపు బికినీలో సముద్రం లోకి వెళ్లి సర్ఫ్ బోర్డ్ తో స‌ర్ఫింగ్ కి ప్రిపేర‌వుతున్న ఫోటోను పంచుకుంది. ఫోటోలో దిషా సముద్రంలో సర్ఫ్ బోర్డ్ మీద హాయిగా నిలబడటంతో పసుపు బికినీ హైలైట్ గా కనిపిస్తోంది. స్విమ్‌సూట్ లో దిశా ఒంపుసొంపులు సంథింగ్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తున్నాయి.

దిశా చివరిసారిగా మళంగ్ చిత్రంలో న‌టించింది. ఇప్పుడు సల్మాన్ ఖాన్- రణదీప్ హుడా- జాకీ ష్రాఫ్ లతో `రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్` లో కనిపిస్తుంది. అంతేకాకుండా మోహిత్ సూరి `ఏక్ విలన్ 2` లో జాన్ అబ్రహం- తారా సుతారియా- అర్జున్ కపూర్ లతో క‌లిసి కీలక పాత్ర పోషించింది. దిశా ప్ర‌ధాన పాత్ర‌లో `కెటినా` అనే చిత్రం షూటింగ్ లో ఉంది.