Begin typing your search above and press return to search.

బికినీతో పటాని పాప.. మైండ్ బ్లోయింగ్ పిక్

By:  Tupaki Desk   |   22 Nov 2022 10:05 AM GMT
బికినీతో పటాని పాప.. మైండ్ బ్లోయింగ్ పిక్
X
ఇటీవల కాలంలో కొంతమంది హీరోయిన్స్ సోషల్ మీడియాలో గ్లామరస్ అందాలతో ఊహించిన విధంగా దర్శనమిస్తున్నారు. ముఖ్యంగా బికినీ ఫోటోషూట్స్ అనేవి కామన్ గా మారిపోయాయి. బికినీలో తరచుగా కనిపించే వారి సంఖ్య కూడా ఎక్కువవుతోంది. ఇక బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని కూడా నాన్ స్టాప్ బికినీ అందాలతో కవ్విస్తుంటుంది. ఇటీవల దిశా మరోసారి బ్లాక్ బికినీలో మైండ్ బ్లోయింగ్ అనేలా కామెంట్స్ అందుకుంది.

సోషల్ మీడియాలో భారీగా ఫ్యాన్ ఫాలోవర్స్ ను సంపాదించుకున్న దిశా రీసెంట్ గా బాత్రూమ్ లో అద్దంలో కనిపించేలా ఫొటోలు దిగింది. ఇక ఇన్ స్టాగ్రామ్ లో ఆ ఫొటో పోస్ట్ చేయగానే వైరల్ అయ్యింది. గతంలో దిశాపటాని చాలాసార్లు బికినీలో కనిపించింది. అయితే ఆమె ఎన్నిసార్లు బికినీలు ఫోటోలు పోస్ట్ చేసినా కూడా ఆమె ఫాలోవర్స్ ను ఎంతగానో ట్రేడ్ చేస్తున్నాయి.

సినిమాలతో భారీ స్థాయిలో విజయాలు అందుకోకపోయినప్పటికీ కూడా అమ్మడు ఈ విధంగా మాత్రం కుర్రాళ్ళ మనసులు గెలుచుకుంటుంది. ఇక ఈ బ్యూటీ సినిమా కెరీర్ విషయానికి వస్తే తెలుగులో అయితే మొదట లోఫర్ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన విషయం తెలిసిందే.

ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయినప్పటికీ కూడా ఆమెకు ఆ తర్వాత తెలుగులో మరికొన్ని ఆఫర్లు వచ్చాయి. కానీ చిన్న సినిమాల్లో నటించడానికి ఒప్పుకోలేదు. ఇక ఎప్పుడైతే బాలీవుడ్లోకి వెళ్ళిపోయిందో అక్కడ ప్రతి ఏడాది ఒక సినిమా చేస్తూ మంచి క్రేజ్ అయితే అందుకుంటూ ఉంటుంది.

ఇక టైగర్ ష్రాఫ్ తో ఆమె భాగీ అనే సినిమా చేసిన తర్వాత డేటింగ్ కూడా మొదలు పెట్టింది. వీరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అనే విధంగా కథనాలు కూడా వచ్చాయి. కానీ ఇంతవరకు ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇక చివరగా ఈ బ్యూటీ ఈ ఏడాది ఎక్ విలన్ రిటర్న్స్ సినిమాలో కనిపించింది.

ప్రస్తుతం మరో మూడు సినిమాలు చేస్తోంది. ఇక అందులో ముఖ్యంగా ప్రాజెక్టు కే సినిమాలో కూడా ఒక ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇక తమిళంలో ఈ బ్యూటీ ఒక స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నట్లు టాక్ వస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.