Begin typing your search above and press return to search.
స్లో మోషన్ హిట్ వెనక దిశా డెడికేషన్ తెలిస్తే షాకే
By: Tupaki Desk | 27 April 2019 6:57 AM GMTబాలీవుడ్ సూపర్ స్టార్ కొత్త సినిమా 'భారత్' జూన్ ఐదున రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్స్ ను మొదలుపెట్టిన టీమ్ ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేసింది. రీసెంట్ గా 'స్లో మోషన్ మే' అంటూ సాగే ఒక పాటను రిలీజ్ చేశారు. అసలే సల్మాన్ సినిమా.. ఈద్ కు రిలీజ్ అయ్యే సినిమాల్లో తప్పనిసరిగా ఒకటో రెండో చార్ట్ బస్టర్ సాంగ్స్ ఉంటాయి. అందులో ఇదొకటి అయిపోయింది.
ఈ పాటలో సల్మాన్ కు జోడి కట్టిన దిశా పతాని గ్లామర్ ఒలికించింది. స్లో మోషన్ లో ప్రేక్షకుల కోసం అందాలను ఆరబోసింది. పసుపు రంగు చీరలో నడుము ఒంపులను ఇంపుగా సొంపుగా కదిలిస్తూ ఈ స్లో మోషన్ పాటను ఎక్కడికో హిమాయల అంచులదాకా తీసుకెళ్ళిపోయింది. సల్మాన్ ఎంతో ఉత్సాహంగా "అరె డూబ్ జావూ తేరే ఆఖోకే ఓషన్ మే.. స్లో.. మోషన్ మే" అని అదోరకం స్టెప్పులు వేస్తుంటే దిశా అతని పక్కన మోడరన్ అతిలోక సుందరిలా నాట్యం చేసింది. సంగీత ప్రియులకే కాదు ఊర మాసు జనాలకు కూడా పాట నచ్చేసింది. రిలీజ్ అయి ఇంకా నాలుగు రోజులు కూడా కాలేదు కానీ అప్పుడే 24 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఐదున్నర లక్షల లైకులు కూడా కొట్టారు. ఇది జస్ట్ టీ సీరీస్ వారి అధికారిక యూట్యూబ్ ఛానల్ లో మాత్రమే. ఇక ఓవరాల్ గా చూసుకుంటే ఈ సంఖ్య ఇంకా పెరుగుతుంది.
ఇదంతా ఒకవైపు. కానీ ఈ పాట కోసం దిశా ఎంత కష్టపడిందో తెలిసిందే ఎవరైనా ఆమెను మెచ్చుకోకుండా ఉండలేరు. మోకాలికి గాయం కావడంతో ఈ పాట చిత్రీకరణ కు ఒక వారం ముందు బెడ్ రెస్ట్ లో ఉందట. రిహార్సల్స్ చేస్తున్న సమయంలో కాలికి గాయం అయిందిని అందుకే బెడ్ రెస్ట్ లో ఉండాల్సి వచ్చిందని రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో వెల్లడించింది. ఈ పాటలో ఫ్రంట్ ఫ్లిప్ ఉంది.. నార్మల్ స్టెప్స్ కాకుండా కొన్ని జిమ్నాస్టిక్స్ స్టంట్స్ కూడా ఉన్నాయి. అవి ప్రాక్టిస్ చేసే సమయంలోనే గాయం అయిందని తెలిపింది. షూటింగ్ రోజున అసలునడవలేని పరిస్థితిలో ఉందట. షూటింగ్ లో ప్రతి టేక్ అయిన తర్వాత కోల్డ్ ప్రెస్ చేయించుకోవాల్సి వచ్చేదని.. ఆ సమయంలో చాలా పెయిన్ ఉండేదని తెలిపింది. కానీ ఇప్పుడు పాటకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే తన కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చిందని అనుకుంటున్నాని తెలిపింది.