Begin typing your search above and press return to search.

ఏక్తాక‌పూర్ తో దిశాప‌టానీ విభేధాలు తారా స్థాయికి!

By:  Tupaki Desk   |   10 Nov 2022 5:57 AM GMT
ఏక్తాక‌పూర్ తో దిశాప‌టానీ విభేధాలు తారా స్థాయికి!
X
కొన్ని ప్రాజెక్టుల‌కు మ‌ధ్యంత‌రంగా అనుకోని అవాంత‌రాలు ఏర్ప‌డ‌తాయి. కొన్నిసార్లు తార‌ల‌కు ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌తో సృజ‌నాత్మ‌క విభేధాలు త‌లెత్తుతుంటాయి. అదే కోవ‌లో ఇంత‌కుముందు చాలా మంది స్టార్లు క్రేజీ ప్రాజెక్టుల నుంచి నిష్కృమించిన సంద‌ర్భాలున్నాయి. గ‌తంలో దోస్తానా 2 నుంచి కార్తీక్ ఆర్య‌న్ ని తొల‌గిస్తున్న‌ట్టు నిర్మాత‌ క‌ర‌ణ్ జోహార్ ప్ర‌క‌టించారు. ఇటీవ‌లే యాక్ష‌న్ కింగ్ అర్జున్ స‌ర్జా తాను స్వ‌యంగా డైరెక్ట్ చేసి నిర్మిస్తున్న సినిమా నుంచి టాలీవుడ్ యువ‌న‌టుడు విశ్వ‌క్ సేన్ ని తొల‌గిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ రెండు సంద‌ర్భాల్లో సృజ‌నాత్మ‌క విభేధాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. స‌ద‌రు న‌టీన‌టుల‌కు వృత్తిగ‌త నిబ‌ద్ధ‌త లేద‌ని నిర్మాత‌లు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఇప్పుడు ఇంచుమించు అలాంటి ఆరోప‌ణ‌ల‌నే ఎదుర్కొంటోంది బాలీవుడ్ హాట్ గాళ్ దిశా ప‌టానీ. వృత్తిగ‌త నిబ‌ద్ధ‌త‌ లేని కారణంగా దిశా పటానీని త‌న ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం కె.టినా నుంచి దిశా ప‌టానీని తొల‌గిస్తున్న‌ట్టు ఏక్త క‌పూర్ కాంపౌండ్ వ‌ర్గాలు లీకులు అందించాయి. దిశా నిష్క్రమించిన తర్వాత ఏక్తా కపూర్ 'కెటినా' కోసం న‌లుగురు క‌థ‌నాయిక‌ల పేర్ల‌ను ప‌రిశీలించారు. ఇప్పుడు శ్రద్ధా కపూర్ - తారా సుతారియాలను సంప్రదించార‌ని తెలిసింది.

2019లో దిశా పటానీని 'కెటినా' చిత్రం కోసం ఏక్త ఎంపిక చేసుకుంది. వాస్తవానికి సల్మాన్ ఖాన్ తో 'రాధే' చిత్రీకరణ పూర్తి చేసిన‌ తర్వాత దిశా ప‌టానీ ఈ సినిమాని ప్రారంభించాల్సి ఉంది. దిశా పటానితో షూటింగ్ ప్రారంభించారు కూడా. కానీ ఇప్పుడు బాలాజీ ప్రొడక్షన్స్ ఈ చిత్రంలో కాస్టింగ్ మార్పు చేయాలని చూస్తున్నట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. తాజా గుస‌గుస‌ల ప్ర‌కారం.. ఏక్తా ఈ చిత్రం కోసం దిశా స్థానంలో శ్రద్ధా కపూర్- ‍‍‍ తారా సుతారియా ఇద్దరినీ సంప్రదించినట్లు తెలుస్తోంది.

ప్రొడక్షన్ టీమ్ సన్నిహిత వ‌ర్గాల వివ‌రాల మేర‌కు.. "దిషా పటాని ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం కోసం ఎంపికైంది. 2019లో ప్రీ-ప్రొడక్షన్ సమావేశాలు జ‌రిగాయి. అలాగే షూటింగ్ కూడా చేసారు. దాదాపు వారం రోజుల‌ పాటు చిత్రీకర‌ణ సాగింది. అయితే మహమ్మారి లాక్ డౌన్ తో చిత్రీక‌ర‌ణ నిలిచిపోయింది. ఇప్పుడు మేకర్స్ కాస్టింగ్ మార్పు చేయాలని చూస్తున్నారు. అయితే చిత్రీకరణ ప్రక్రియ మధ్యలో ఆకస్మిక మార్పు ఏమిటనే దానిపై ర‌క‌ర‌కాల సందేహాలు నెలకొన్నాయి. లాక్ డౌన్ తర్వాత దిషా పటానీ నిర్మాతల మధ్య ర‌క‌ర‌కాల‌ సమస్యలు తలెత్తాయి. వాస్తవానికి షూటింగ్ సమయంలో కూడా దిశ- బాలాజీ మోషన్ పిక్చర్స్ మధ్య సృజనాత్మక అంశాల కార‌ణంగా సమస్యలు ఉన్నాయి. సృజనాత్మక వ్యత్యాసాల కార‌ణంగా దిశాకు నిర్మాత‌లు స‌హా ఇత‌ర తార‌ల‌తోను ఇబ్బందులు ఏర్ప‌డ్డాయి. చివ‌రికి ఇది తాను వైదొల‌గ‌డానికి దారితీసింది. ఏక్తా - దిశా ఒకే మాట‌పై నిల‌వ‌డం కష్టంగా మారింది. పైగా KTina ఏక్తా కపూర్ నిజ జీవితం ఆధారంగా రూపొందిస్తున్న బ‌యోపిక్ త‌ర‌హా సినిమా కాబట్టి ఆమె ప్రాజెక్ట్ విష‌య‌మై చాలా ఎక్కువ‌గా దృష్టి సారించారు. ప్రతిదీ సరిగ్గా ఉండాలని కోరుకుంటోంది. ప్రధాన పాత్ర సహృదయత మంచి ప్రవర్తనతో ఉండాలి. కానీ దిశాతో అది కుద‌ర‌లేదు. దీంతో త‌న‌ను తొలగించడం తప్ప వేరే మార్గం లేద‌ని ఏక్తా భావించార‌ట‌.

దిశా స్థానంలో కొత్త తారాగణం గురించి వివ‌రాలు కూడా తాజాగా లీక‌య్యాయి. ప్ర‌స్తుతం శ్రద్ధా కపూర్ - తారా సుతారియా ఇద్దరినీ KTinaలో భాగం చేయడానికి ఏక్తా క‌పూర్ సంప్రదించింది. దిశా పటానీ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇద్దరితో చర్చలు జరుగుతున్నాయి. ఈ మార్పు దృష్ట్యా చిత్రీకరణ ప్ర‌స్తుతానికి ఆగిపోయింది. తారాగణంలో మార్పు చేసిన తర్వాత మళ్లీ సినిమా ప్రారంభమవుతుంది. ఆసక్తికరంగా ఈ చిత్రానికి సంబంధించి కొంత భాగం ఇప్పటికే చిత్రీకరించినా కానీ తారాగణం మార్పు త‌ప్ప‌దని సోర్స్ చెబుతోంది. ప్రధాన నాయిక‌ను ఖరారు చేసిన తర్వాత షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుంద‌ని తెలిసింది.

దిశా పటానీ - ఏక్తా మధ్య సమస్యలు కొంతకాలంగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాస్తవానికి అనన్య పాండే - నుష్రత్ భరుచ్చా ల‌ను కూడా ఏక్తా ఈ చిత్రం కోసం సంప్రదించారు. దురదృష్టవశాత్తూ ఇద్దరితో ఏదీ వర్కవుట్ కాలేదు. మేకర్స్ ఇప్పుడు శ్రద్ధ - తారలను సంప్ర‌దించారనేది టాక్. చిత్రీక‌ర‌ణ‌ విషయానికొస్తే షూటింగ్ పునఃప్రారంభం కావడానికి ఇంకా కొంత సమయం ఉంది. KTina ఒక చిన్న టౌన్ నుంచి వ‌చ్చిన‌ పంజాబీ అమ్మాయి కథ. ఏక్తా జీవితం కోణంలో క‌థ న‌డుస్తుంది. ఈ చిత్రానికి రాజ్ శాండిల్య క‌థ క‌థ‌నం రాశారు. అషిమా చిబ్బర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏక్తా కపూర్ నిర్మిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.