Begin typing your search above and press return to search.

సాగర నారికి విటమిన్ 'సీ' కావాలట

By:  Tupaki Desk   |   28 Nov 2016 7:38 AM GMT
సాగర నారికి విటమిన్ సీ కావాలట
X
టాలీవుడ్ లో చేసినది ఒకే సినిమా అయినా.. బ్యూటీ దిశా పటానీ ఇక్కడి జనాలను బాగానే పటాయించింది. అందాలతో పాటు డ్యాన్సింగ్ స్కిల్స్ కూడా బాగా ఎక్కువగా ఉన్నా.. లోఫర్ ఫెయిల్యూర్ అమ్మడికి ఛాన్సులు రాకుండా చేసింది. అంతలోనే జాకీచాన్ మూవీలో ఆఫర్ పట్టేసిన ఈ హాట్ బ్యూటీ.. సోషల్ మీడియాలో మరీ హాట్ రచ్చ చేసేస్తూ ఉంటుంది.

తరచుగా బికినీ షోకులతో సహా తన అందాలను అభిమానులకు పంచి పెట్టే దిశా పటానీ.. ఇప్పుడు సాగరనారిగా మారిపోయింది. 'ఈ మూడ్ లో విటమిన్ సీ(sea)కావాలి' అంటోంది దిశా. అమ్మడికి అందాలే కాదు.. మాటల్లో పదను కూడా ఎక్కువే అనే విషయం బాగానే అర్ధమవుతోంది. ఇంతకీ అమ్మడు షేర్ చేసిన ఫోటోలో.. ఆమె మొహం మాత్రం కనిపించడం లేదు. నీలి రంగు టూపీస్ బికినీలో నీటి అడుగున జలకన్యలా మారిపోయింది దిశా పటానీ. అభిమానులకు అందించాల్సిన అందాలు అంత స్పష్టంగా ఇచ్చేశాక.. ఇక ఫేస్ చూపించకమాత్రం పెద్దగా నష్టం ఏం ఉండదు కానీ.. ఇంతకీ దిశా పటానీ గ్లామర్ ఎగ్జిబిషన్ రోజురోజుకి ఎందుకు పెరిగిపోతోందో అనుకుంటున్నారు జనాలు.

జాకీచాన్ తో మూవీ చేస్తుండడంతో.. తన తర్వాతి టార్గెట్ హాలీవుడ్ అని ఫిక్స్ అయిపోయిందా అనే డౌట్స్ కూడా మొదలైపోయాయి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/