Begin typing your search above and press return to search.
ఈ లోఫర్ బ్యూటీ ఫేవరేట్ బుక్ అదేనట!
By: Tupaki Desk | 10 March 2021 5:30 PM GMTబాలీవుడ్ యంగ్ హీరోయిన్ దిశాపటాని గురించి తెలుగు ప్రేక్షకులకు అక్కర్లేదు. లోఫర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన దిశా.. మళ్లీ తెలుగులో సినిమాలు చేయలేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే యాక్షన్ సినిమాలు చేసే దిశా ఇష్టపడే బుక్ 'ఏ లైఫ్ ఇన్ సీక్రెట్స్'. సారా హెల్మ్ రచించిన ఈ పుస్తకం ట్యాగ్ లైన్ ‘ఆట్‌కిన్స్ అండ్ ది మిస్సింగ్ ఏజెంట్స్ ఆఫ్ వరల్డ్ వార్–2’ చూస్తే ఓ అవగాహన వస్తుంది. టైటిల్ చుసినవారందరికి ఎవరు ఈ ఆట్‌కిన్స్ అనే సందేహం వ్యక్తం అవుతుంది. ఆమె రెండో ప్రపంచయుద్ధ కాలంలో బ్రిటీష్ సీక్రెట్ ఆర్గనైజేషన్‌లో స్పెషల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ (ఎస్‌వోయి) ఫ్రాన్స్ సెక్షన్‌లో ఇంటెలిజెన్స్ అధికారిగా పనిచేసిందట. ఆ తర్వాత హెడ్ ఆఫ్ ది ఫ్రెంచ్ సెక్షన్‌కు అసిస్టెంట్ స్థాయికి చేరుకుంది.
తాజాగా ఈ పుస్తకం గురించి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు దిశా ఫ్యాన్స్. అసలు ఏముందా అంటూ వెతికేస్తున్నారు. నిజానికి ఆట్కిన్స్ పనేంటంటే ఇంటర్వ్యూ చేసి స్పెషల్ ఏజెంట్లను సెలెక్ట్చేయడమే. సెలెక్ట్ అయినవారిని 16వ శతాబ్దానికి చెందిన కంట్రీ హౌజ్‌లో ఉంచుతారు. అసలు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ‘కమెండో కోర్స్’ చేయిస్తారట. ఫేక్ ఐడెంటిటీలతో శత్రువులను ఎలా బురిడీ కొట్టించాలో ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు. అలాగే అవసరమైన భాషను కూడా నేర్పిస్తారు. వీటితో పాటుగా ఫ్రాన్స్‌లో పోలీస్ రూల్స్.. కర్ఫ్యూ, రేషనింగ్, ట్రాన్స్‌పోర్ట్ విధానాలు ఎలా ఉంటాయనే వివరాలు ఈ పుస్తకంలో ఉన్నాయట.
ట్రైనింగ్ అయ్యాక జర్మనీకి పంపిస్తారు. ‘మోస్ట్ డేరింగ్ ఆట్‌కిన్స్ ‘కవరింగ్’ స్టోరీలు క్రియేట్ చేయడంలో.. క్యాంప్‌లో జర్మనీ అధికారులు ఇంటరాగేట్ చేయడంలో నెంబర్‌వన్ రోల్ ప్లే చేసింది. అంతేగాక జేమ్స్‌బాండ్ సిరీస్‌లో ‘మిస్ మనీ పెన్నీ’ క్యారెక్టర్ కు ఆట్‌కిన్స్ క్యారెక్టర్ స్ఫూర్తిగా నిలించిందని టాక్. ప్రస్తుతం దిశా ఫేవరేట్ పుస్తకం పై వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. దిశా ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సరసన 'రాధే' సినిమా చేస్తోంది.