Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్ చుక్కలు చూపించారుగా..

By:  Tupaki Desk   |   13 Dec 2016 5:00 PM IST
ఫ్యాన్స్ చుక్కలు చూపించారుగా..
X
సెలబ్రిటీస్ అంటే మాములు జనాలకి అదో క్రేజ్. ఇక హీరో- హీరోయిన్స్ కనిపిస్తే అస్సలు ఆగరు. పైగా ఇది సెల్ఫీస్ జనరేషన్. మూవీ పర్సనాల్టీస్ కనిపిస్తే వెంటబడి మరీ ఫోటోలు తీసేసుకుంటున్నారు. అయితే ఇవేవీ పట్టించుకోకుండా బయటికొచ్చిన హీరోయిన్ దిశాపఠానీకి ఫ్యాన్స్ చుక్కలు చూపించేశారు.

పూరీ తీసిన లోఫర్ మూవీతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది దిశాపఠానీ. మన దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ.. బాలీవుడ్ లో మాత్రం దిశా కెరీర్ గ్రాఫ్ బానే ఉంది. టైగర్ ష్రాఫ్ తో చేసిన వీడియో ఆల్బమ్ హిట్టవడంతో పాటు.. ధోనీ మూవీతో మంచి గుర్తింపే వచ్చింది. అందుకే ఎక్కడికి వెళ్లినా అభిమానులు చుట్టుముట్టేస్తున్నారు. రీసెంట్ గా జిమ్ నుంచి వస్తుందో లేకపోతే ఏదైనా పర్సనల్ వర్క్ మీద బయటికొచ్చిందో గానీ దిశాపఠానీని గుర్తు పట్టేసిన జనాలు వెంటనే ఆమెని రౌండప్ చేసేశారు.

కొంతమంది సెల్ఫీస్ కూడా మొదలెట్టేశారు. వాళ్లని తప్పించుకోని తన కారు దాకా రావడానికి దిశకి చుక్కలు కనిపించేశాయ్. ఎలాగోలా ఫ్యాన్స్ తాకిడి నుంచి బయటపడి కారెక్కి అక్కడ్నుంచి తుర్రుమంది. అభిమానుల తాకిడి భరించలేకే హీరో- హీరోయిన్స్ కాస్త స్టేటస్ రాగానే బాడీగార్డ్స్ ను పెట్టేసుకుంటున్నారు. మరీ తనని ఇంకా ఎవరు గుర్తు పడతారనుకుందో.. లేకపోతే సింపుల్ గా ఉండాలనుకోని సెక్యుర్టీ దాకా పోలేదో కానీ దిశాపఠానీని ఫ్యాన్స్ హడలెత్తించేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/