Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: బ్రాండెడ్ అందాలు

By:  Tupaki Desk   |   19 Sep 2017 9:56 AM GMT
ఫోటో స్టోరి: బ్రాండెడ్ అందాలు
X
ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ మొదటి సినిమాల్లో కనిపించినట్టు రెండవ సినిమాలో అస్సలు కనిపించడం లేదు. గ్లామర్ పాత్రలతోనే ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకోవచ్చని ఇష్టం వచ్చినట్టు అందాలను ఆరబోస్తున్నారు. ఇక సినిమాలో అవకాశాలు రాకపోతే సోషల్ మీడియానే ఆధారంగా చేసుకొని అందాలని యథేచ్ఛగా చూపించేస్తూ.. వారి హోదాను ఇంకా పెంచేస్తున్నారు.

ఇక ఏ మాత్రం ఫోటో షూట్స్ జరిగినా ఆ ఫోటోలు నెట్ లో హల్ చేయాల్సిందే అంటున్నారు. ప్రస్తుత రోజుల్లో హీరోయిన్లు వారి సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేస్తున్న ఫొటోలు చాలా వైరల్ అవుతున్నాయి. ఏ మాత్రం లిమిట్స్ లేకుండా దాటేయాల్సిన గీతాలన్నీ దాటేస్తున్నారు, ఇదే తరహాలో లోఫర్ సీనిమాతో వెండితెరకు పరిచయమైన దిశా పటాని అందాలను తెగ ఆరబోస్తోంది. అమ్మడు తన సోషల్ మీడియా అకౌంట్ లో ఎవరు ఊహించని విధంగా సెక్సీ పోజులను ఇస్తూ తన ఉనికిని చాటుకుంటోంది. రీసెంట్ గా పుమా లాంటి బడా కంపెనీ ప్రమోట్ చేస్తూ ఇచ్చిన ఒక స్టీల్ అందరిని ఆకట్టుకుంటోంది.

సెక్సీ అందాలతో బ్రాండెడ్ దుస్తులకు బాగానే ప్రచారాన్ని నిర్వహిస్తోంది దిశా. సన్నని నడుముతో సెక్సీ స్టీల్ ఇచ్చి కుర్రకారు ఓపికకు పరిక్ష పెడుతోంది. అంతే కాకుండా దిశా ఇచ్చిన లుక్స్ కి ఎవ్వరైనా ఆమెకు దాసోహం అయిపోవాల్సిందే అని ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దిశా తన ప్రియుడు టైగర్ షారోప్ హీరోగా నటిస్తున్న "భాగీ 2" అనే బాలీవుడ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.