Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: లవ్లీ గౌన్ లో లోఫర్ బ్యూటీ

By:  Tupaki Desk   |   28 Aug 2018 12:39 PM GMT
ఫోటో స్టొరీ: లవ్లీ గౌన్ లో లోఫర్ బ్యూటీ
X
అమ్మాయిల డిక్షనరీ లో అందం అనే పదం ఉంటుంది గానీ జాలి దయ కరుణ అనే పదాలు ఉండవు. దానికి ఉదాహరణ గోవిందం అనే అబ్బాయిని గీత ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాపించడమే. అర్జున్ రెడ్డి లాంటి విజయ్ దేవరకొండ పరిస్థితే అలా ఉంటే ఇక అందగత్తెలను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే అప్పారావు.. సుబ్బరావుల పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. సోషల్ మీడియా లో దశ దిశలా గ్లామర్ ను వెదజల్లుతున్నబ్యూటీల్లో దిశా పతాని పేరు తప్పని సరిగా మనం చెప్పుకోవాలి.

ఆమె హాటుగా ఘాటుగా ఫోటోలకు పోజులిచ్చి నెటిజనుల నిద్రను ఆవలీలగా పాడు చేస్తుంది. ఈమధ్య దిశా కు సంబంధించిన ఫోటో ఒకటి బయటకు వచ్చింది. పేరుకి ఒకటే గానీ అవి మూడు ఫోటోలు. చిట్టి పొట్టి ఆకుపచ్చ గౌన్ లో మిమిమం మేకప్ తో -వీలైనన్ని తక్కువ యాక్సెసరీస్ తో అలా నడిచింది. చేతిలో ఒక చిన్ని పర్సు - స్మార్ట్ ఫోన్ మాత్రమే ఉన్నాయి. లైట్ గా బ్లీచ్ చేసిన హెయిర్ ను అలా లూజ్ గా వదిలేసింది. అసలే పాలరాతి శిల్పంలా మెరుస్తూ ఉంది. లిప్స్ కి లైట్ రెడ్ కలర్ లిప్ స్టిక్ తగిలించి ఓ స్మైల్ ఇచ్చింది. మరి ఈ అమ్మడి ఊరు ముంబై కాబట్టి అక్కడ 108 లు ఉన్నాయో లేదో?

ఎందుకు 108 లు.. కుయ్యి కుయ్యి మని శబ్దాలు అని అడుగుతారా? ఇంకా మీకు తత్త్వం బోధపడలేదు. దిశా అలా నడిస్తే ఆమెకు నలు దిశల్లో ఉన్న వాళ్ళకు హార్ట్ ఎటాక్ రాదా.. బీపీలు పెరగవా.. షుగర్ కౌంట్ 400 కు చేరదా? అప్పుడు 108 కాకుండా.. RX100 వస్తుందా ఏంటి?