Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: కుచ్చిళ్లు దోపిన పంచెక‌ట్టు!

By:  Tupaki Desk   |   9 Oct 2018 1:30 AM GMT
ఫోటో స్టోరీ: కుచ్చిళ్లు దోపిన పంచెక‌ట్టు!
X
ట్రెండ్ సెట్ చేయ‌డంలో గ‌బ్బ‌ర్‌ సింగ్ నే కొట్టేసేట్టుంది లోఫ‌ర్ బ్యూటీ. ఫ్యాష‌నిస్టా సోన‌మ్ క‌పూర్ త‌ర్వాత అంత‌కుమించి చెల‌రేగిపోతున్న ఏకైక నాయిక‌ దిశాప‌టానీ. ఎప్ప‌టిక‌ప్పుడు న‌వ‌త‌రం త‌న‌నే అనుస‌రించేంత‌గా ఫ్యాష‌న్ ను ప‌రిచ‌యం చేస్తోంది. టూపీస్ బికినీ వేయాల‌న్నా.. ఎప్ప‌టిక‌ప్పుడు మార్కెట్‌ ని అనుస‌రించి కొత్త కాస్ట్యూమ్స్ ని ఎలివేట్ చేయాల‌న్నా దిశాని మించిన పెర్ ఫెక్ట్ ఫిట్ బాడీ వేరొక‌రు లేరంటే అతిశ‌యోక్తి కాదు.

ఇదిగో అందుకు సింబాలిక్‌గానే మ‌రో స్పెష‌ల్ డిజైన‌ర్ డ్రెస్‌ లో మైమ‌రిపించింది. ప్ర‌ఖ్యాత ఎల్లే ఇండియా బ్యూటీ అవార్డ్స్ కార్య‌క్ర‌మంలో దిశా ఇలా కొత్త లుక్‌ లో క‌నిపించి ఆక‌ట్టుకుంది. డార్క్ షేడెడ్ సిమెంట్ క‌ల‌ర్ డ్రెస్‌లో మైమ‌రిపించింది. చూప‌రుల‌కు ఓ ర‌కంగా చీర కుచ్చిళ్ల‌ను దోపిన‌ట్టుగా క‌నిపిస్తూనే - వేరొక కోణంలో ప‌క్కా మాస్ పంచెక‌ట్టును కూడా గుర్తు చేస్తోంది. ఆ రెండిటి కాంబినేష‌న్ ని దృష్టిలో ఉంచుకునే ఈ డిజైన్‌ ని రూపొందించారా? అనిపిస్తోంది. మా గొప్ప ఫ్యాష‌న్ ట్రెండునే ప‌రిచ‌యం చేసింద‌ని యూత్ చ‌ర్చించుకునేంత‌గా ఆక‌ర్షిస్తోంది ఈ డిజైనర్ లుక్.

దిశా కెరీర్‌ని ప‌రిశీలిస్తే `భాఘి 2` చిత్రంతో వంద కోట్ల క్ల‌బ్ క‌థానాయిక‌గా క్రేజు తెచ్చుకుంది. అదే హుషారులో ప్రియుడు టైగ‌ర్ ష్రాఫ్‌ స‌ర‌స‌న `భాఘి 3` చిత్రంలోనూ ఈ అమ్మ‌డు న‌టించే అవ‌కాశం ఉంద‌న్న ప్ర‌చారం సాగింది. అలానే స‌ల్మాన్ భాయ్ న‌టిస్తున్న భ‌ర‌త్ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. మ‌రిన్ని ప్రాజెక్టుల‌కు ఈ అమ్మ‌డు సంత‌కాలు చేయ‌నుంద‌ని తెలుస్తోంది. కెరీర్ ఆరంభ‌మే జాకీచాన్ అంత‌టి వాడితో క‌లిసి `కుంగ్‌ఫూ యోగా` అనే చిత్రంలో న‌టించి ఇంట‌ర్నేష‌న‌ల్ అప్పీల్ ఉన్న స్టార్ గానూ అంద‌రి క‌ళ్ల‌లో ప‌డిన సంగ‌తి తెలిసిందే. అందుకే ఆ స్టైల్ దిశా కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తోంది.