Begin typing your search above and press return to search.
లోఫర్ బేబి యూట్యూబ్ చానెల్ ట్రీట్
By: Tupaki Desk | 15 Sep 2019 3:46 PM GMTబాలీవుడ్ అందాల కథానాయికలు ఒక్కొక్కరుగా యూట్యూబ్ బాట పడుతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా- యూట్యూబ్ కాదేదీ ప్రచారానికనర్హం అన్న చందంగా ఎవరికి వారు సొంతంగా ఓ మీడియాల ద్వారా గ్రాఫ్ పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఓవైపు యూట్యూబ్ .. సోషల్ మీడియాల ద్వారా యాడ్ రెవెన్యూ పెరిగే ఛాన్సుంది కాబట్టి అక్కడ కర్ఛీఫ్ వేసేందుకు ఏమాత్రం మొహమాటం పడటం లేదు. ఎవరికి వారు సొంత యూట్యూబ్ చానెళ్లతో బరిలో దిగుతున్నారు. ఇప్పటికే పలువురు కథానాయికలు సొంత యూట్యూబ్ ల పేరుతో రెగ్యులర్ వ్యాపకాల్ని పోస్ట్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉన్నారు. అదే బాటలో ఇప్పుడు లోఫర్ బ్యూటీ దిశా పటానీ యూట్యూబ్ చానెల్ తో హల్ చల్ మొదలు పెట్టడం అభిమానుల్లో చర్చకొచ్చింది.
ఇప్పటికే సోషల్ మీడియాలో దిశా వెరీ స్పీడ్. ఇన్ స్టాగ్రమ్ లో దాదాపు 30లక్షల మంది ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. అలాగే యూట్యూబ్ చానెల్ ని ప్రారంభించి తొలి వీడియోని పోస్ట్ చేసింది ఈరోజు. ప్రతిరోజు తాను ఎలా బతికేస్తుందో అన్నిటినీ ఇక్కడ ఏకరువు పెడుతుందట. ఇకపై ఇందులో రెగ్యులర్ వ్యాపకాల్ని వీడియోల రూపంలో పోస్ట్ చేస్తుందట. జిమ్- ఫిట్ నెస్ వ్యవహారాలు సహా పర్సనల్ లైఫ్ వీడియోల్ని పోస్ట్ చేయనుంది.
పొద్దున్నే నిదుర లేచి జిమ్-యోగా-ర్యాంపింగ్ వాక్- డ్యాన్స్ క్లాసులు .. ఇలా ఒకదాని వెంట ఒకటిగా అన్నిటినీ ఇక్కడ వీక్షించవచ్చు. మీతో ఈ డెమో వీడియోని షేర్ చేయడం కోసం ఆగలేకపోయాను. .. ఆత్రపడ్డాను! అంటూ అభిమానులకు టచ్ లోకి వచ్చింది. అలాగే ఇందులో `రా ఫుటేజ్` వీడియోల్ని ఒరిజినాలిటీతో పోస్ట్ చేస్తానని ఫ్యాన్స్ కి ప్రామిస్ చేసింది. వాటిలో అపరిపక్వంగా ఏదైనా ఉంటే ఎక్స్ క్యూజ్ మీ అంటోంది.
వీడియో కోసం క్లిక్ చేయండి