Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : అందాలతో బనానా మిల్క్ షేక్ అందిస్తున్న అమ్మడు...!

By:  Tupaki Desk   |   17 May 2020 3:29 PM GMT
ఫోటో స్టోరీ : అందాలతో బనానా మిల్క్ షేక్ అందిస్తున్న అమ్మడు...!
X
దిశా పటానీ.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'లోఫర్' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది ఈ బాలీవుడ్‌ బ్యూటీ. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో అమ్మడికి టాలీవుడ్ లో అవకాశాలు రాలేదు. దీంతో ఇక్కడి నుండి చెక్కేసి బాలీవుడ్ సినిమాలపై దృష్టి పెట్టింది. అక్కడ 'ఎంఎస్ ధోని - అన్ టోల్డ్ స్టోరీ' సినిమా హిట్ కావడంతో బాలీవుడ్ కు పరిమితం అయ్యింది. అక్కడ స్టార్ హీరోల పక్కన్న ఛాన్సులు కొట్టేస్తూ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. అక్కడ అవకాశాలనే కాదు.. అభిమానులను కూడా సంపాదించుకుంది. 'కుంఫు యోగా' 'భారత్' 'భాగీ 2' 'మలంగ్‌' సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంది దిశా. సినిమాలో హీరోయిన్ గా నటిస్తూనే అవకాశం వచ్చినప్పుడు ఐటమ్ సాంగ్స్ తో అదరగొడుతోంది. ప్రస్తుతం సల్మాన్‌ ఖాన్‌ సరసన ‘రాధే’ సి నిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో మళ్ళీ ఛాన్సెస్ అందిపుచ్చుకోని ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారా ఇక్కడి వాళ్లకు కూడా టచ్ లో ఉంటుంది. ఈమె పెట్టే పోస్టుల కోసం కుర్రకారు వెయిట్ చేస్తుంటారు. పొట్టి పొట్టి డ్రెస్ లు వేసుకొని దిగిన తన ఫొటోలతో పిచ్చెక్కిస్తుంది.

ఇప్పుడు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తుండటంతో అందరు సెలబ్రెటీల మాదిరే దిశా పాప కూడా ఇంటికే పరిమితమైంది. డైలీ ఏదొక ఫోటోనో వీడియోనో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తోంది. తన మేట్స్ తో వీడియో కాల్స్ చేసుకుంటూ టైంపాస్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు లేటెస్టుగా అమ్మడు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటో వైరల్ అయింది. మామూలుగానే కుర్రకారుకి వేడి పుట్టించే దుస్తుల్లో మెరుపులు మెరిపించే దిశా ఇప్పుడు స్పెషల్ డ్రెస్ లో కనిపించి కనువిందు చేసింది. పొట్టి నిక్కర్ తో ఎల్లో కలర్ టాప్ తో అదరగొట్టింది. దీనికి హనీ బీ ఎమోజీ యాడ్ చేసింది. తన టాప్ పై 'బనానా మిల్క్ షేక్' అని టెక్స్ట్ ఉండటంతో నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా దిశా పటానీని మళ్లీ తెలుగు తెరకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'పుష్ప' సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం దిశాని సంప్రదిస్తున్నట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.