Begin typing your search above and press return to search.
మెలికల్లో మెరుపులకు దిశ చూపిస్తోంది
By: Tupaki Desk | 9 March 2017 6:00 PM GMTఉత్తరాది భామ దిశా పటానిని ప్రొఫెషనల్ గా ఓ ఇండస్ట్రీకి కట్టబెట్టడం కష్టం. ఇప్పటికి ఈ భామ నాలుగు సినిమాలు చేస్తే.. వాటిలో మొదటిది తెలుగు సినిమా లోఫర్. ఆ తర్వాత రెండు బాలీవుడ్ సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. జాకీ చాన్ సరసన ఇంటర్నేషనల్ మూవీ కుంగ్ ఫూ యోగా కూడా చేసేసింది.
ఇక అమ్మడి ప్రతిభా పాటవాల సంగతి చూస్తే.. ఈ కుర్రదానికి డ్యాన్స్ అంటే మహా ఇష్టం. కాదు పిచ్చి అనడం కరెక్టేమో. డ్యాన్సుల్లో తన ట్యాలెంట్ ఏ స్థాయిలో ఉంటుందో.. అప్పట్లో లోఫర్ ఆడియో ఫంక్షన్ స్టేజ్ పైనే చూపించేసింది దిశా. వరుస బాలీవుడ్ ఆఫర్లతో మళ్లీ ఇక్కడ మూవీ చేయలేదు కానీ.. చేసుంటే మాత్రం చాలామందికి కాంపిటీషన్ అయిపోయేది.
నృత్యం చేయడంలో ఇంతటి ప్రతిభ ఈ ఉత్తరాది అమ్మడిలో ఉండడానికి అసలు కారణం.. ఈ భామ చేసే ఎడతెగని సాధనే. కాసింత టైం దొరికినా సరే.. డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసేస్తుంటుంది. చిందులు వేయడాన్ని చిందరవందరగా ఆనందించేసే అరుదైన కేరక్టర్ దిశా పటానీది. అందుకే అంతటి ట్యాలెంట్ చూపించేయగలుగుతుంది. తాజాగా ఈ సొగసరి డ్యాన్స్ ప్రాక్టీసులు చేసిన వీడియో ఒకటి ఇంటర్నెట్ లో చక్కర్లు కొట్టేస్తోంది.
డ్యాన్స్ చేయడంలో దిశ చూపిస్తున్న స్పీడ్ చూస్తుంటే.. ఏ ప్రొఫెషనల్ డ్యాన్సర్ కి తీసిపోదనే విషయం అర్ధమయిపోతుంది. ఇంత ట్యాలెంట్ ఈమెలో ఉందా అని ఆశ్చర్యపోవాల్సిందే. ప్రతీ స్టెప్పులోనూ ఓ కులుకు.. ప్రతీ మెలికలోనూ ఓ మెరుపు.. ప్రతీ కదలికలోనూ ఓ మత్తును రంగరించి మరీ డ్యాన్స్ చేయడం అందరికీ అబ్బే విద్యకాదు. కానీ దిశాకు మాత్రం ఇది వెన్నతో పెట్టిన విద్యా ఏంటి అనిపించక మానదు.
అతి తక్కువ సినిమాలతో ఈ స్థాయికి వెళ్లే అవకాశం అందరికీ రాదు కానీ.. అలా వెళ్లాలంటే అపారమైన ప్రతిభా పాటవాలు ఉండాల్సిందే. వాటి విషయంలో దిశా పటానీ దగ్గర ఏ మాత్రం కొదువ లేదు. అందానికే వన్నె తెచ్చేసేంతటి వయ్యారం.. ఈ మిస్ ఇండియా రన్నరప్ సొంతం. కొద్దిలో మిస్ అయింది కానీ.. లేకపోతే ప్రపంచాన్ని యేలేసేదే.