Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: బికినీ బ్యూటీ ఈజ్ బ్యాక్!

By:  Tupaki Desk   |   20 Sep 2018 9:17 AM GMT
ఫోటో స్టొరీ: బికినీ బ్యూటీ ఈజ్ బ్యాక్!
X
ఈ ఇన్స్టాగ్రామ్ కేమైంది.. బ్యూటీలు బికినీలతో రచ్చ చేస్తున్నా ఎవ్వరూ నోరు మెదపరెందుకు? ఉత్త బికినీ సరే.. ఎర్ర బికినీలో ఇంపుగా ఉన్న ఒంపుసొంపులను ఇక ధారపోస్తూ నవ్వితే నెటిజనులు ఏం చెయ్యాలి?  వాళ్ళ చేతిలో ఉన్న మౌస్ తో క్లిక్ లు కొట్టుకోవాలి.  దయచేసి మెరుగైన సమాజం రిపోర్టర్లలా తప్పుడు అర్థాలను మాత్రమే అర్థం చేసుకోకండి. అప్పుడప్పుడూ పాజిటివ్ యాంగిల్ కూడా చూడండి.

ప్రతి దానికి ఇప్పుడు ఒక క్లిక్ కావాలి.  లైక్ కొట్టాలంటే ఒక క్లిక్.. షేర్ చెయ్యాలంటే మరో క్లిక్.. లేదా లాప్ టాప్ లో ఉన్న ఎర్రబికినీ లో ఉన్న పతాని తో మనం సెల్ఫీ తీసుకోవాలన్నా క్లిక్ చేయాలి. కాబట్టి క్లిక్ కు ఎన్నో మంచి అర్థాలు ఉన్నాయి.  సరే.. అసలుకంటే కొసరెక్కువైంది అన్నట్టు  దిశా బికినీ కంటే క్లిక్స్ గోల ఎక్కువైంది.  రెడ్ కలర్ బికిని ఫోటో పోస్ట్ చేసిన దిశా దీనికి కిచ్చిన క్యాప్షన్ 'పువ్వు బొమ్మ'.  

ఇక క్యాప్షన్ లో  పువ్వు ఎందుకు పెట్టిందో.. చూసిన వాళ్ళకు ఏం అర్థం అవుతుందో ఆ భగవంతుడికే తెలియాలి.  రెండు గంటల్లోనే 7 లక్షలకు పైగా లైక్స్ వచ్చిన ఈ ఫోటోకు ఇక్కడ రాయలేని భాషలో ఘాటు కామెంట్లు కూడా వచ్చాయి.  అవన్నీ మనకొద్దుగానీ ఒక నెటిజన్ మాత్రం ఇక్కడ చెప్పుకుందాం.  'టైగర్ బొహత్ లక్కీ హై' టైగర్ అనగానే మన టాలీవుడ్ యాంగ్ టైగర్ అనుకునేరు... కొంపలు మునుగుతాయి... టైగర్ ష్రాఫ్. దిశా బాయ్ ఫ్రెండ్!