Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: ఇన్నర్ వేర్ లో లోఫర్ బ్యూటీ

By:  Tupaki Desk   |   17 Oct 2018 1:53 PM GMT
ఫోటో స్టొరీ: ఇన్నర్ వేర్ లో లోఫర్ బ్యూటీ
X
అన్నిబ్రాండ్స్ ఎండార్స్ చేసేందుకు అందరూ సెలెబ్రిటీలు సూట్ అవుతారనుకుంటే అంతకంటే పొరపాటు మరోకటి లేదు. ముఖ్యంగా ఫిట్నెస్ బ్రాండ్స్ కు ఎండార్స్ చేసేవారు ఫిట్ గా లేకపోతే చూసేవారికి ఎబ్బెట్టుగా ఉంటుంది. ఇక ఇన్నర్ వేర్ ను ప్రమోట్ చెయ్యాలంటే కూడా కాస్త హాటుగా ఉండాలి. అందుకే పాపులర్ ఇన్నర్ వేర్ బ్రాండ్ అయిన కాల్విన్ క్లెయిన్ వారు బాలీవుడ్ హాటీ దిశా పతానిని బ్రాండ్ పాపగా ఎంచుకున్నారు.

ఇక ఫోటో షూట్ కూడా చేశారు. అసలే దిశా పతాని కి బికినీ బ్యూటీ అని పేరు. అందమైన బీచుల్లో నిలబడి 2 పీస్ బికినిల్లో పోజివ్వడం.. వాటిని ఇన్స్టా లో షేర్ చేయడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. ఇక ఇలాంటి ఇన్నర్ వేర్ బ్రాండ్ కు ఫోటో షూట్ అంటే ఎలా రెచ్చిపోతుందో మీరు ఊహించుకోవచ్చు. ఆ ఫోటో షూట్ అయిన తర్వాత తన ఇన్స్టా ఖాతా లో ఒక కిర్రాక్ ఫోటో పెట్టింది. "ఇప్పుడే షూట్ పూర్తి చేశా.. నా మోస్ట్ ఫేవరెట్ బ్రాండ్ తో త్వరలో గొప్ప అసోసియేషన్ ప్రారంభం కానుంది.. ఫుల్ గా ఎగ్జైట్ అయి ఉన్నా" అని క్యాప్షన్ ఇచ్చింది.

ఇదేం అన్యాయం.. ఎగ్జైట్ మెంట్ అంతా ఆమెకేనా? నెటిజనులకు ఉండదా.. ఆమె ఫొటో చూసిన ఎగ్జైట్ మెంట్ లో జస్ట్ ఏడు గంటల్లోనే 1.2 మిలియన్ లైకులు కొట్టారు. ఇంతకీ ఫోటో ఎలా ఉంది? అది వర్ణించాలంటే మహాకవి కాళిదాసు దిగిరావాల్సిందే.. మాలాంటి అర్భకులకు అసాధ్యం. కానీ చూసి అనందించడం మాత్రం అంతరికీ సాధ్యం.. ఇంకా లేటెందుకు బాబులు చూడండి.. జన్మ ధన్యం చేసుకోండి.