Begin typing your search above and press return to search.
కావాలంటే గుండు కొట్టించుకుంటా...
By: Tupaki Desk | 29 Aug 2017 4:07 AM GMTటాలీవుడ్ లో ఏం మహిమ ఉందో గాని చాలా మంది నార్త్ భామలు తెలుగులో అడుగేసి గాని బాలీవుడ్ కి వెళ్ళరు. తెలుగులో నటిస్తే యాక్టింగ్ వస్తుంది అనుకుంటారో..మరి ఓ ట్రయల్ వేద్దాం అనుకుంటారో గాని బాలీవుడ్ లో నెక్స్ట్ ఆఫర్ ఉన్నా తెలుగులో ఓ సినిమా చేసి బాలీవుడ్ కి చెక్కేస్తారు. కాని మళ్ళీ ఇటువైపు రావాలంటే చాలా కాలమే పడుతుంది.
ఇదే తరహాలో బాలీవుడ్ కి చెక్కేసి ఇప్పుడు సోషల్ మీడియాలో మోస్ట్ సెర్చిడ్ పాపులర్ హీరోయిన్ గా ఎదుగుతోంది దిశా పటాని. తెలుగు లోఫర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి సంవత్సరం తిరగకముందే బాలీవుడ్ లో రెండు సినిమాలను దక్కించుకుంది. అందులో ఒకటి ఇండియన్ క్రికెట్ దిగ్గజం ధోని బయోపిక్ "ధోని ది అన్ టోల్డ్ స్టోరీ" మూవీ. ఆ సినిమా లో చేసింది చిన్న పాత్రే అయినా అమ్మడు మంచి నటనతో ఆకట్టుకుంది. అయితే రీసెంట్ గా ఓ ప్రెస్ మీట్ లో ఈ అమ్మడికి ఓ వినూత్న ప్రశ్న ఎదురైంది.
ప్రస్తుతం బి-టౌన్ కి చెందిన కొందరు హీరోయిన్స్ ఎందుకు కొత్త తరహా పాత్రలతో కనిపించడం లేదు. ముఖ్యంగా గ్లామర్ పాత్రలను వదిలి గుండు కొట్టించుకోవడం లాంటి ప్రయోగాలు ఎందుకు చేయలేరు అని ఆగడంతో.. ఈ అమ్మడు అలాంటి పాత్రలు చేయకపోవడానికి కారణం ''కొంతమంది హీరోయిన్స్ ని ప్రేక్షకులు తక్కువ స్థాయిలో చూడాలి అనుకోరు. కొందరు హీరోయిన్స్ కూడా అందుకు ఎక్కువగా ఇష్టపడరు. నాకు అయితే అలాంటి ఛాన్స్ వస్తే తప్పకుండా గుండు కొట్టించుకుంటా.. కాకపోతే అందుకు తగ్గట్టుగా ఒక బలమైన స్క్రిప్ట్ ఉంటేనే.. అలాగే అలాంటి పాత్ర అవసరం అనుకుంటేనే ఎలాంటి ప్రయోగాలకైనా సిద్దం'' అంటోంది 'లోఫర్' ప్రేక్షకులతో తెలుగువారికి తన గ్లామర్ టచ్ ఇచ్చిన దిశా పటానీ.
అయితే ప్రస్తుతం దిశా ఏ సినిమాల్లో నటించడం లేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో లో కుంగ్ ఫు యోగా సినిమాతో వచ్చినా అవకాశాలు అంత పెద్దగా రాలేవు. కానీ ఓ రెండు స్క్రిప్ట్ లను లైన్ లో పెట్టిందని తెలుస్తోంది. అందులో ఒకటి లవ్వర్ టైగర్ ష్రాఫ్ తో చేయబోయే బాఘీ 2 సినిమా!!