Begin typing your search above and press return to search.

బెడ్ పై ఒంటిని విల్లులా మార్చిన దిశా..

By:  Tupaki Desk   |   19 Jan 2023 3:30 AM GMT
బెడ్ పై ఒంటిని విల్లులా మార్చిన దిశా..
X
బాలీవుడ్ భామ దిశ పటానికి తెలుగులో కూడా ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కెరియర్ తెలుగు సినిమాతోనే మొదలుపెట్టిన ఆమె ఆ తర్వాత బాలీవుడ్‌కి వెళ్లి సెటిల్ అయ్యే ప్రయత్నాలు చేస్తోంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లోఫర్ సినిమాలో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్‌గా సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె.. ఆ తర్వాత ధోని సినిమాతో కాస్త పేరు తెచ్చుకుంది.

ఆ తర్వాత ఆమె అనేక సినిమాలు చేస్తూ వచ్చింది. కానీ ఒక్క సినిమా కూడా ఆమెకు క్రేజీయస్ట్ హీరోయిన్ అనే పేరు తీసుకురాలేకపోయింది. అయితేనేమి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ.. స్టార్ హీరోయిన్లకు కూడా లేనంత సోషల్ మీడియా ఫాలోయింగ్ దక్కించుకుంటుంది.

కాల్విన్ ప్లైన్ అనే ఒక లోదస్తుల కంపెనీకి ఇండియన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ.. ఉండే ఈ భామ ఎప్పటికప్పుడు ఆ లోతు స్థలం ధరించి వాటిని ప్రమోట్ చేసే పనిలో ఉంటుంది. తాజాగా బ్లాక్ కలర్ డాటెడ్ లో దుస్తులు ధరించిన ఆమె విల్లులాంటి తన శరీరాన్ని వంచి కూరగారందరికీ హార్ట్ రేట్ ఇచ్చింది. మంచం మీద తన ఒంటిని వింటిలా వంచి ఫోజులు ఇవ్వడంతో చలికాలంలో కూడా చెమటలు పట్టిస్తోందంటూ... ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

కొందరైతే మీ క్యూట్‌ నెస్ రహస్యం ఏమిటి మేడం మాకు కూడా చెప్పండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొన్నాళ్ల క్రితం వరకు బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో చట్టపట్టలేసుకుని తిరిగిన ఆమె.. ఈ మధ్య అతనికి బ్రేకప్ చెప్పి దూరమైంది. ఇప్పుడు ఆమె ఒక కొత్త బాయ్ ఫ్రెండ్‌తో తిరుగుతుందనేది బాలీవుడ్ వర్గాల వాదన. విదేశీ మోడల్ నటుడైన అలెగ్జాండర్ ఇలిక్ అనే వ్యక్తితో ఆమె ఇప్పుడు డేటింగ్ చేస్తోందని బాలీవుడ్ మీడియా అయితే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. దానికి తగినట్లుగానే వీరిద్దరూ కూడా ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఉండడంతో వీరి ప్రేమాయణం నిజమేనని అందరూ భావిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.