Begin typing your search above and press return to search.
లేడీ టైగర్ కిక్ బాక్సింగ్!
By: Tupaki Desk | 27 Nov 2018 10:29 AM GMTకరాటే .. జూడో.. కిక్ బాక్సింగ్.. ఈ విద్యల్లో మినిమంగా రాటు దేలితేనే ఈ సమాజంలో అమ్మాయిలు బతకగలరు. లేదంటే ఎన్ని మీటూ ఉద్యమాలు చేసినా పురుషాధిక్య ప్రపంచాన్ని ఢీకొట్టలేరు. ఈ నగ్నసత్యాన్ని చాలా ముందే తెలుసుకోవడంలో కథానాయికలు ముందు వరుసలో ఉంటారు. అందానికి మించి.. ఫిట్ నెస్ ను కాపాడుకునే ప్రయత్నాలు చేసేది ఇందుకే. గ్లామర్ & గ్లిజ్ ప్రపంచంలో ఎప్పుడు ఏ అవసరం ఎలా వస్తుందో చెప్పలేం. అన్నిటికీ పక్కాగా ప్రిపేర్డ్ గా ఉంటేనే ఇక్కడ మనుగడ.
ఫిట్ నెస్ విషయంలో అందరికంటే ముందుంటుంది దిశా పటానీ. ఈ భామ ప్రియుడు టైగర్ ష్రాఫ్ తో పోటీపడుతూ రెగ్యులర్గా జిమ్ చేస్తుంటుంది. ఫిజికల్ ఫిట్ నెస్ లో అతడి నుంచి స్ఫూర్తి పొంది మగరాయుళ్లనే ఢీకొట్టే రేంజులో దేహశిరుల్ని తీర్చి దిద్దుతోంది. అప్పట్లో టోన్డ్ బాడీలోంచి 6ప్యాక్ ని .. మజిల్స్ ని చూపించే ప్రయత్నం చేసింది దిశా. బాప్ రే ఈవిడ లోఫర్ బ్యూటీయేనా? అంటూ కుర్రాళ్లు కళ్లప్పగించి చూశారు. ఎప్పటికప్పుడు రెగ్యులర్ యోగా - జిమ్ కి సంబంధించిన వీడియోలు - ఫోటోల్ని దిశా సామాజిక మాధ్యమాల్లో రిలీజ్ చేస్తూ యూత్ లో స్ఫూర్తిని నింపుతోంది.
ఈ దాహం తీరనిది... అది ఎన్నటికీ తరగనిది! అన్న తీరుగా ఓ వీడియోని దిశా సామాజిక మాధ్యమాల్లో అభిమానులకు చేరవేసింది. ఇది చూసినవాళ్లంతా ఒకటే షాక్ తింటున్నారు. దిశా గాల్లో ఎగిరెగిరి తంతోంది! గిరగిరా బొంగరంలా తిరిగేస్తూ బంతాడేస్తోంది. తనకు కిక్ బాక్సింగ్ నేర్పిస్తున్న ప్యాడ్ మ్యాన్ కం జిమ్ కోచ్ సైతం నిలబడలేనంతగా ఎగిరెగిరి తంతోంది. ఒక్క క్షణం దిశా గాల్లో ఫ్రీజ్ అయిన ఫోటోని కాప్ చర్ చేసి ఇలా సామాజిక మాధ్యమాల్లో వదిలారంతే. ఆ ఫోటోని యూత్ సామాజిక మాధ్యమాల్లో ఒకటే వైరల్ చేస్తున్నారు. దిశా ప్రస్తుతం భరత్ అనే చిత్రంలో నటిస్తోంది. ఆ తర్వాత ప్రియుడు టైగర్ ష్రాఫ్ తో కలిసి నటించే `భాఘి 3`కి టైమ్ దగ్గరపడుతోందేమో? అన్నట్టు దిశా కష్టం చూసిన ఓ అభిమాని లేడీ టైగర్ అంటూ కాంప్లిమెంట్ ను పోస్ట్ చేశాడు ఇన్ స్టాలో. ప్చ్!!