Begin typing your search above and press return to search.

క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రికే అక్క‌లా ఏమిటీ సాహ‌సం దిశా?

By:  Tupaki Desk   |   19 Aug 2020 8:50 AM GMT
క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రికే అక్క‌లా ఏమిటీ సాహ‌సం దిశా?
X
20 కేజీల డంబెల్ ఎత్తాలంట‌నే ఓ మోస్త‌రు స్టామినా కావాలి. 40 కేజీలు.. 60 కేజీలు.. 80..100 కేజీలు అంటూ పెంచుకుంటూ వెళితే ఇంకేమైనా ఉందా? జిమ్ లో పొగ‌లు పుట్ట‌డం ఖాయం. భారీకాయులు దానిని స‌వాల్ గా తీసుకుని ప్ర‌య‌త్నిస్తుంటారు. ఇక రెగ్యుల‌ర్ జిమ్ స్పెష‌లిస్ట్ దిశా ప‌టానీ దీనిని ఎంత సునాయాసంగా ముగించేసిందో చూస్తే.. ఔరా! అన‌కుండా ఉండ‌లేం.

దాదాపు 120 కేజీల వెయిట్ ని ఎత్తి అవ‌తలేసింది దిశా. 5కేజీల ప్లేట్లు ఒక డ‌జ‌నున్న‌ర‌ .. 20 కేజీల ప్లేట్లు అటొక‌టి ఇటొక‌టి త‌గిలించి ఏకంగా 120 కేజీల బ‌రువును ఎలా పైకి ఎత్తేసిందో చూస్తున్నారా? క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రికే అక్క‌లా దిశాప‌టానీ సాహసాన్ని మెచ్చ‌కుండా ఉండ‌లేం. అయితే ఇదంతా మాజీ ప్రియుడు టైగ‌ర్ ష్రాఫ్ పుణ్య‌మే. ఆయ‌న వ‌ల్ల‌నే దిశా ఇలా అయ్యింది. రెగ్యుల‌ర్ జిమ్ ఫ్రీక్ గా మారి బ‌రువుల్ని అమాంతం ఎత్తేస్తోంది. ప‌ర్ఫెక్ట్ టోన్డ్ బాడీని మెయింటెయిన్ చేయ‌డం అంటే మాట‌లా? ఇదేమైనా ఆట‌లా? అంటూ అభిమానులు ప‌రేషాన్ అయిపోతున్నారు మ‌రి.

ఫిట్‌నెస్ ప్రియురాలు అయిన నటి దిషా పటాని త్రోబాక్ వీడియోలను షేర్ చేసింది. అక్కడ 120 కిలోల బరువుతో పూర్తి స్థాయి స్క్వాట్ కు సాహ‌సించింది. ఈ వీడియో మాజీ ప్రియుడు టైగర్ ష్రాఫ్, అతని తల్లి ఆయేష్ ష్రాఫ్ ల‌ను కూడా మెప్పించేసింద‌ట‌. మొదటి వీడియోలో, దిషా 75 కిలోల బరువుతో స్క్వాట్స్ చేసింది. 80 కిలోల నుంచి 120 కేజీల‌కు బరువును పెంచింది.

చివ‌రిసారిగా.. మలంగ్ చిత్రంలో కనిపించిన దిషా త‌దుప‌రి సల్మాన్ ఖాన్ 'రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్', 'కెటినా` .. 'మలంగ్ 2` లో న‌టిస్తోంది. 'రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్' అనే యాక్షన్-డ్రామా ఈ సంవత్సరం ఈద్ సందర్భంగా విడుదల కావాల్సి ఉండ‌గా.. కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఆలస్యం అయింది.