Begin typing your search above and press return to search.

ఆ స్టార్ హీరో తో చేయనని చెప్పేసిందే!

By:  Tupaki Desk   |   31 May 2019 9:06 AM GMT
ఆ స్టార్ హీరో తో చేయనని చెప్పేసిందే!
X
సల్మాన్ ఖాన్ సినిమాలో అవకాశం వస్తే చాలు ఎగిరి గంతేస్తారు చాలామంది. కారణం ఏంటంటే బాలీవుడ్ లో అయన ఒక గాడ్ ఫాదర్ టైపు. ఎవరికైనా ఆఫర్లు ఇప్పించగలడు. తన సినిమాలోనూ ఛాన్స్ ఇవ్వగలడు. కానీ ఈమధ్య కొందరు సల్లూ భాయ్ సినిమాలకు కూడా నో చెప్తున్నారు. ప్రియాంక చోప్రా 'భారత్' సినిమాలో హీరోయిన్ గా నటించాల్సి ఉంది. కానీ నిక్ జోనాస్ తో వివాహం.. ఆతర్వాత అమెరికాకు షిఫ్ట్ కావడం.. ఈ హడావుడిలో ప్రియాంక 'భారత్' నుండి తప్పుకుంది. అప్పటి నుంచి సల్మాన్ ఛాన్స్ దొరికినప్పుడల్లా ప్రియాంకపై సెటైర్లు వేస్తున్నాడు.

ఇదిలా ఉంటే తాజాగా దిశా పతాని ఇకపై సల్మాన్ ఖాన్ తో జోడీ కట్టనని ప్రకటించింది. కాల్విన్ క్లెయిన్ ఇన్నర్ బ్యూటీ అయిన దిశాకు ఇప్పుడు బాలీవుడ్ లో పిచ్చ క్రేజ్ ఉంది. సల్మాన్ తో 'భారత్' లో కూడా నటించింది. 'స్లో మోషన్ మే' అంటూ ఒక చార్ట్ బస్టర్ సాంగ్ లో ఆడిపాడింది. మరి సల్మాన్ తో ఫ్యూచర్ లో నటించనని ఎందుకు చెప్పినట్టు? దీనికి దిశా చెప్పిన కారణం.. సల్మాన్ కు దిశా కు వయసు తేడా ఎక్కువ ఉండడంతో జోడీ సరిగా లేదనిపిస్తోందట. అందుకే ఇకపై నటించను అంటోంది.

కానీ గుసగుసలు మాత్రం మూడు నాలు రకాల వెర్షన్లు ఉన్నాయి. దిశా బాయ్ ఫ్రెండ్ టైగర్ ష్రాఫ్ సూచనతోనే ఇలా చేస్తోందని ఒక వెర్షన్. ఈమధ్య ప్రియాంక పై సల్మాన్ పంచ్ వేస్తూ 'నా సినిమా కోసం చాలామంది ఆడవాళ్లు మొగుళ్లను వదిలేసి వస్తారు' అంటూ నోరు జారాడు. దీనిపై విమర్శలు కూడా వ్యక్తం అయ్యాయి. దీనికి నిరసనగా దిశా చేస్తోందని.. అయితే అసలు కారణం చెప్పడం ఇష్టంలేక వయసు తేడా అని సాకు చెప్తోందని మరో వాదన. 'భారత్' సినిమాలో దిశా పతానిది సెకండ్ హీరోయిన్ పాత్రే. అసలు ఫోకస్ అంతా కత్రినా పైనే ఉందట. ప్రమోషన్స్ లో కూడా అంతా కత్రినా హవానే. దీంతో అప్సెట్ అయిన దిశా ఇకపై మెయిన్ హీరోయిన్ పాత్రలు మాత్రమే చేయాలని నిర్ణయించుకుందట. అందుకే సీనియర్ హీరోలు వరసగా సెకండ్ హీరోయిన్ పాత్రలు ఇస్తారనే భయంతో ఇలా వయసు తేడా అంటోందని కూడా ఒక టాక్. ఈ టాకుల సంగతేమో కానీ అసలు ఏం జరిగి ఉంటుందబ్బా?!