Begin typing your search above and press return to search.

దిశ దశ మాత్రం మారలేదు

By:  Tupaki Desk   |   18 April 2018 10:50 AM IST
దిశ దశ మాత్రం మారలేదు
X
తెలుగులో సూపర్ హిట్టయిన క్షణం మూవీ హిందీలో బాఘీ-2 పేరిట రీమేక్ చేశారు. టైగర్ ష్రాఫ్ - దిశా పటాని హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో క్షణం స్టోరీ రూపురేఖలు మొత్తం మార్చేసి భారీ ఫైట్లతో నింపేసి దాన్నో యాక్షన్ చిత్రం చేసేశారు. ఈమధ్యే రిలీజైన ఈ సినిమా జనాలకు బాగానే ఎక్కింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

ఏదైనా సినిమా హిట్టయితే అందరికంటే ఎక్కువ సంబరపడేది అందులో నటించిన హీరో హీరోయిన్లే. టైగర్ ష్రాఫ్ - దిశా పటానీలకు బాఘీ-2 సినిమా విషయంలో ఇది రివర్సయింది. ఈ సినిమా కలెక్షన్లు కొల్లగొడుతున్నా తరవాత సినిమా చేయమంటూ వీరివైపు కన్నెత్తి చూసిన నిర్మాత కానీ.. దర్శకుడు కానీ లేకుండా పోయాడట. బాఘీ-2తో బాలీవుడ్ లో తన దశ తిరిగిపోతుందన్న ఆశతో దిశ ఈ సినిమాలో తన అందాలన్నీ ఓ రేంజిలో ఆరబోసింది. ఆమెఒంపుసొంపులు ప్రేక్షకులను ఫిదా చేసినా ఎందుకో ఫిలిం మేకర్ల దృష్టి మాత్రం ఆమెపై పడలేదు. దీంతో దిశా డీలా పడినట్టే కనిపిస్తోంది.

ప్రస్తుతం దిశా చేతిలో సంఘమిత్ర ఆఫర్ ఒక్కటే ఉంది. తెలుగు తమిళం హిందీ భాషల్లో ఒకేసారి భారీ చిత్రంగా దీనిని తెరకెక్కించేందుకు నిర్మాతలు ప్లాన్ చేశారు. ఈ సినిమా అనౌన్స్ మెంట్ తప్ప ఇంతవరకు అడుగు ముందుకు పడింది లేదు . అసలు ఎప్పుడు మొదలవుతుందో కూడా తెలియదు. ఇది తప్ప మరో ఆఫర్ లేని దిశా తన దశ తిరిగేదెప్పుడని ఆశగా ఎదురుచూస్తోంది.