Begin typing your search above and press return to search.

ఈ న‌గ‌రానికి ఏమైంది అన్న‌ట్లే ఈ బ్యూటీకి ఏమైంది?

By:  Tupaki Desk   |   28 Dec 2021 11:30 PM GMT
ఈ న‌గ‌రానికి ఏమైంది అన్న‌ట్లే ఈ బ్యూటీకి ఏమైంది?
X
ఫ్యాష‌న్ రంగంలో ఎవ‌రి ఇష్టం వారిది. ఎవ‌రికి న‌చ్చ‌న‌ట్లు వారుండొచ్చు. ట్రెండ్ ని ఫాలో అవ్వ‌డమే కాదు. కొంద‌రు ట్రెండ్ ని సెట్ చేస్తారు అన్న‌ది కూడా వాస్త‌వ‌మే. తాజాగా బాలీవుడ్ బ్యూటీ దిశా ప‌టానీ అలాంటి అరుదైన ట్రెండ్ సెట్ చేసే ప్ర‌య‌త్నంలోనే విమ‌ర్శ‌లు మూట‌గ‌ట్టుకుంది. ముంబై ఎయిర్ పోర్టులో ఈ భామ నీలిరంగు చినుగుల జీన్ ఫ్యాంట్ ధ‌రించి క‌నిపించింది.

న‌డుము ద‌గ్గ‌ర నుంచి కాళ్ల వ‌ర‌కూ ఫ్యాంట్ అంతా బాగా చినిగి ఉంది. ఇది డిజైన్ కావొచ్చు. కానీ మ‌రీ టూమ‌చ్ డిజైన్ లా క‌నిపించింది. ఫ్యాంట్ వేసుకున్నా..వేసుకోక‌పోయినా పెద్ద‌ తేడా ఏం క‌నిపించ‌లేదు. తొడ‌ల ద‌గ్గ‌ర నుంచి కాలి చివ‌రి వ‌ర‌కూ ప్యాంట్ కి ఉన్న చినుగేలే హైలైట్..

ఇక దీనికి కాంబినేష‌న్ గా బ్రౌన్ క‌ల‌ర్ టాప్ ధ‌రించింది. ఈ ఫోటోని సెల‌బ్రిటీ ఫోటో గ్రాఫ‌ర్ మాన‌వ్ మంగ్లానీ సోష‌ల్ మీడియాలో షేర్ చేసారు. దీంతో నెటిజ‌నులు ఒక్క‌సారిగా చెల‌రేగిపోయారు. దిశా పై భ‌గ్గుమ‌న్నారు.

అడుక్కునే వాళ్లు కూడా ఇలాంటి ఫ్యాంట్లు వేసుకోరు. ఒక‌రైతే పోకిరిలా క‌నిపిస్తున్నావ్. ఎంత పేద‌వాళ్లు!..నా దేశానికి ఏమైంది ధ‌న‌వంతులు ఇలా చినిగిన బ‌ట్ట‌లు వేసుకుంటున్నారు? అని విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది.

దిశా ప‌టానీ న్యూ మోడ‌ల్ పై నెటిజ‌నులు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. అయితే ఈ చినుగుల డెనిమ్ ని కావాల‌నే ఎంపిక చేసుకున్న దిశా తాను అనుకున్న‌ది సాధించింది. వివాదాలు విమ‌ర్శ‌ల‌తోనే త‌న‌కు మైలేజ్ అన్న‌ది గుర్తించి ఇలా క్లెవర్ గా ప్లాన్ చేస్తోంది. త‌ద్వారా ఈ బ్యూటీ ప్ర‌క‌ట‌న‌ల ఆదాయం ఒక రేంజులో ఆర్జిస్తోంది. సీకే బ్రాండ్ స‌హా ప్ర‌ముఖ ప్ర‌క‌ట‌న‌ల కంపెనీల‌న్నీ దిశాతోనే సోష‌ల్ మీడియాల్లో ప్ర‌చారం చేయించుకుంటున్నాయి.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. మెగా ప్రిన్స్ వ‌రుణ్ తే జ్ క‌థానాయ‌కుడిగా పూరి జ‌గ‌న్నాధ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `లోఫ‌ర్` సినిమాతో ఈ బ్యూటీ టాలీవుడ్ కి ప‌రిచయ‌మైన సంగ‌తి తెలిసిందే. కానీ ఆ సినిమా అంచ‌నాల్ని అందుకోలేదు. దీంతో అమ్మ‌డు బాలీవుడ్ లోనే స్థిర‌ప‌డింది. ప్ర‌స్తుతం అక్క‌డ బిజీ న‌టిగా కొన‌సాగుతోంది. యువ హీరోల నుంచి సీరియ‌ర్ హీరోల వ‌ర‌కూ అంద‌రి స‌ర‌స‌న అవ‌కాశాలు అందుకుంటోంది.