Begin typing your search above and press return to search.

పెళ్లి క‌న్నా సినిమాలే ముఖ్య‌మ‌ట

By:  Tupaki Desk   |   9 May 2018 5:30 PM GMT
పెళ్లి క‌న్నా సినిమాలే ముఖ్య‌మ‌ట
X
ఆ హీరో హీరోయిన్ల‌పై రూమ‌ర్స్ ఇప్ప‌టివి కావు. ఎప్ప‌ట్నించో వినిపిస్తూనే ఉన్నాయి. వారిద్ద‌రూ కూడా ఎప్పుడూ చెట్టాప‌ట్టాలేసుకుని ముంబై వీధుల్లో ఎయిర్ పోర్టులో విదేశాల్లో షికార్లు చేస్తూ మీడియా కంటికి చిక్కుతూనే ఉన్నారు. అయినా వారిద్ద‌రూ రిలేష‌న్‌లో ఉన్నామ‌ని మాత్రం ఒప్పుకోరు. త్వ‌ర‌లో త‌మ ప్రేమ ప్ర‌యాణానికి శుభం కార్టు వేయాల‌నుకుంటున్నాడు హీరో. ఇంత‌కీ ఆ జంట ఎవ‌రో తెలుసా? బాఘీ 2 జంట టైగర్ ష్రాఫ్ - దిశా ప‌టానీ.

టైగర్ ష్రాఫ్ దిశా ప‌ట‌నీలు క‌లిసి ఓ వీడియో ఆల్బ‌మ్‌ లో క‌లిసి న‌టించారు. అప్ప‌ట్నించి ఇద్ద‌రూ జోడీగా మారిపోయారు. విదేశాల‌కు షికార్లు చేస్తూ అక్క‌డ బీచ్‌ లో ఫోటోల‌కు ఫోజులిచ్చారు. లంచ్‌కు డిన్న‌ర్‌కు క‌లిసి వెళుతూ మీడియాకు దొరికిపోయారు. ఎన్నిసార్టు అడిగినా తామిద్ద‌రం జస్ట్ ప్రెండ్స్ అని చెప్పి త‌ప్పించుకున్నారు. కానీ వీరిద్ద‌రి మ‌ధ్య ల‌వ్ ఎఫైర్ ఉంద‌న్న సంగ‌తి వారి త‌ల్లిదండ్రుల‌కు సైతం తెలుస‌నట. కాగా టైగ‌ర్ ష్రాప్ త్వ‌ర‌గా పెళ్లి చేసుకోవాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం. అంతేకాదు పెళ్ల‌య్యాక దిశా చేత సినిమాల‌కు బైబై చెప్పించాల‌ని కూడా అనుకుంటున్నాడ‌ట‌. అయిదే దిశా మాత్రం ఇప్ప‌ట్లో సినిమాల‌ను విడిచి పెట్ట‌డానికి సుముఖంగా లేద‌ట‌. ఆమెకు ప్ర‌స్తుతం పెళ్లి క‌న్నా సినిమాలే ముఖ్య‌మ‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం.

దిశా కొన్ని రోజుల క్రిత‌మే సౌత్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాను చేజిక్కించుకుంది. ఇలాంటి స‌మ‌యంలో పెళ్లి గురించి ఆమె ఆలోచించే ప‌రిస్థితిలో లేదు. మ‌రి టైగ‌ర్ ష్రాఫ్ త‌న ప్రియురాలిని ఎలా ఒప్పిస్తాడో చూడాలి. లేక ఆమె త‌న సినిమాలు పూర్తి చేసుకుని పెళ్లికి రెడీ అనేంత వ‌ర‌కు వేచి యుంటాడో లేక పెళ్ల‌య్యాక కూడా సినిమాలు చేయొచ్చ‌ని గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చి పెళ్లి చేసుకుంటాడో చూడాలి.