Begin typing your search above and press return to search.

లోఫర్ పాప బాధేంటంటే...

By:  Tupaki Desk   |   8 March 2017 12:22 PM GMT
లోఫర్ పాప బాధేంటంటే...
X
లోఫర్ మూవీతో తెరంగేట్రం చేసిన బ్యూటీ దిశా పటానీ. తొలి సినిమా హిట్ కాకపోయినా.. అమ్మడికి గుర్తింపు బాగానే వచ్చింది. ఇక్కడ అవకాశాలు వచ్చేలోపు.. బాలీవుడ్ చెక్కేసిన ఈ బ్యూటీ బేఫిక్రాతో పాటు.. ఎంఎస్ ధోనీ ది అన్ టోల్డ్ స్టోరీలో కీలకపాత్రలో చేసేసింది. అ తర్వాత ఇంటర్నేషనల్ స్టార్ జాకీ చాన్ తో కలిసి కుంగ్ ఫూ యోగాలో కూడా నటించిన దిశా పటానీ.. ఇప్పుడు తెగ బాధ పడిపోతోంది.

ఇందుకు కారణం.. ఓ సినిమా అవకాశం చేతికి అందినట్లే అంది జారిపోవడమే. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ మూవీకి సీక్వెల్ లో నటించేందుకు సైన్ చేసింది దిశా. కరణ్ జోహార్ తీసే మూవీ కావడంతో.. అమ్మడికి బిగ్ లీగ్ లో ఛాన్స్ దొరికేసినట్లే అని ఫిక్స్ అయ్యారంతా. కానీ అంతలోనే సిట్యుయేషన్ తేడా కొట్టేసింది. ఈ అవకాశం చేజారిపోయింది. ఇందులో దిశా తప్పేమీ లేకపోవడమే అసలు ఆలోచించాల్సిన విషయం. ఈమెకు ఆఫర్ చేసిన రోల్ లోకి.. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ ను తీసుకున్నాడు కరణ్ జోహార్.

ఇటు స్టార్ డైరెక్టర్.. అటు స్టార్ హీరో.. మధ్యలో దిశా పటానీ మాట్లాడ్డానికి ఏం లేకపోయింది. తనకు జరిగిన అన్యాయం సంగతి తెలిసినా.. బైటకు చెప్పుకోలేని పరిస్థితుల్లో చిక్కుకుపోయిన దిశా పటానీ.. మరో మంచి ప్రాజెక్టు వస్తుందిలే అని సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/