Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: జిగేల్ అనిపించే గ్లామర్

By:  Tupaki Desk   |   29 Jun 2017 11:38 AM GMT
ఫోటో స్టోరి: జిగేల్ అనిపించే గ్లామర్
X
దిశా పటాని. లోఫర్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు బాలీవుడ్ లో ఎలాగైనా పెద్ద హీరోయిన్ అయిపోవాలని విశ్వప్రయత్నం చేస్తోంది. అయితే ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు కాని.. బాయ్ ఫ్రెండ్ టైగర్ ష్రాఫ్‌ తో కలసి చేస్తున్న బాఘీ 2 సినిమా షూటింగ్ కాక మునుపే అమ్మడు మ్యాగజైన్ కవర్లతో హోరెత్తిస్తోంది. ఎంతసేపూ గ్లామర్ ఒలకబోయడమే సింగిల్ పాయింట్ ఎజెండాగా పెట్టుకున్న దిశా.. ఇప్పుడు మరోసారి అదే ఫీట్ చేసింది. ఈసారి మ్యాగ్జిమ్ మ్యాగజైన్ కోసం మళ్ళీ సొగసులు ఆరబోసింది.

గతంలో ఇదే మ్యాగజైన్ కోసం లోదుస్తుల్లో పోజులిచ్చిన దిశా పటాని.. ఇప్పుడు అదే మ్యాగజైన్ కు ఛమక్ అని కనిపించే బ్రైట్ కలర్స్ లో జిగేల్ అని తన గ్లామర్ ను వడ్డించింది. రంగురంగుల వయ్యారాల్లో ఆ హొయలను అలా చూస్తుంటే.. ఎవరికైనా కూడా ఎప్పుడో ఎక్కడో చూసిన కజురహో శిల్పాలు గుర్తుకురావల్సిందే. కాకపోతే అన్నింటికంటే కూడా.. ఇలా ఒక ప్రక్కన తన వయ్యారాలతో సెగలు రేపుతూ.. అమ్మడు మాత్రం ఆ అమాయకమైన ఎక్స్ ప్రెషన్ పెడుతుంది చూడండి.. కుర్రాళ్ళు నాశనం అయిపోతున్నారంతే.

కాకపోతే సినిమాల వరకు వచ్చేసరికి ఎందుకో దిశా పటానీకి యాక్టింగ్ రాకపోవడం ఆమెకు మైనస్ అవుతోంది. ఏదో బాఘీ 2 అంటే బాయ్ ఫ్రెండ్ ఇప్పించాడు కాని అన్ని సినిమాలనూ అలా ఇప్పించలేడుగా!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/