Begin typing your search above and press return to search.
లోఫర్ పాప ఎంత ప్రేమిస్తోందో!!!
By: Tupaki Desk | 8 March 2016 4:12 AM GMTలోఫర్ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది దిశాపటానీ. పూరీ హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టినా పెద్దగా కలిసొచ్చిందేం లేదు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన మెగా హీరోయిన్ గా అరంగేట్రం చేసినా టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కొత్తగా ఆఫర్స్ ఏమీ రాలేదు. కానీ ఒకేసారి జాక్ పాట్ కొట్టినట్లుగా ఉంది అమ్మడి పరిస్థితి. ఏకంగా హాలీవుడ్ హీరో జాకీచాన్ సరసన హీరోయిన్ గా ఆఫర్ పట్టేసిన దిశా పటానీ.. తన ఆనందాన్ని అందరితోను పంచుకుంటోంది.
'నా గురించి ఎంతే కేర్ తీసుకుంటున్న స్వచ్ఛమైన మనిషికి కృతజ్ఞతలు. ఇప్పటికీ, ఎప్పిటికీ నువ్వు నాకే కాదు ఎంతో మందికి స్ఫూర్తిగా ఉంటావ్. బహుశా నీ గురించి చాలా మందికి తెలిసిన విషయం నీ పేరు జాకీ చాన్ అనే. కానీ ఆ పేరు కంటే ఎంతో ఉన్నతమైన వ్యక్తి అనే సంగతి ప్రపంచం తెలుసుకుంటుంది. ఎంతో ఉదారంగా, ప్రేమించే, మంచి గొప్ప వ్యక్తితో పని చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే శాంటా నన్ను కలిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో అంత కంటే ఎక్కువ. నీ గురించి వర్ణించడానికి శాంటా ఒక్క పదం చాలదు' అంటూ జాకీ చాన్ ని ఆకాశానికి ఎత్తేసింది దిశా పటానీ.
ఏదో ఒక రోజున ప్రపంచం అంతా జాకీచాన్ అంతటి స్వార్ధం లేని మానవత్వం గురించి తెలుసుకుంటుందట. లవ్ యూ.. అంటూ ట్వీట్ దిశా పటానీ చేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది.