Begin typing your search above and press return to search.
సూపర్ స్టార్ ఏజ్ పై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
By: Tupaki Desk | 30 May 2019 7:11 AM GMTబాలీవుడ్ లో కొత్త, పాత అనే తేడా లేకుండా ప్రతి ఒక్క హీరోయిన్ కూడా స్టార్ హీరో అయిన సల్మాన్ ఖాన్ తో నటించేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. సల్మాన్ తో కలిసి ఒక్క సినిమాలో నటించినా కూడా స్టార్ డం దక్కుతుందనేది అందరి అభిప్రాయం. అందుకే బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ నుండి సామాన్యమైన హీరోయిన్స్ వరకు అంతా కూడా సల్మాన్ నుండి పిలుపు కోసం ఎదురు చూస్తారు. అయిదు పదుల వయసు దాటినా కూడా సల్మాన్ తో పాతికేళ్ల లోపు హీరోయిన్స్ కూడా రొమాన్స్ కోరుకుంటారు.
తాజాగా దిశా పటాని మాత్రం సల్మాన్ వయసు రిత్యా ఆయనతో నటించను అంటూ తేల్చి చెప్పేసింది. తాజాగా సల్మాన్ ఖాన్ నటించిన 'భారత్' అనే చిత్రంలో దిశా పటాని సెకండ్ హీరోయిన్ గా నటించింది. మొదటి హీరోయిన్ గా కత్రీనా కైఫ్ నటించగా.. పెద్దగా ప్రాముఖ్యత లేని హీరోయిన్ గా మాత్రమే దిశా కనిపించింది. తాజాగా భారత్ సినిమా ప్రమోషన్ సందర్బంగా దిశా పటాని ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడటం జరిగింది.
ఆ సందర్బంగా దిశా పటానిని విలేకరి మళ్లీ సల్మాన్ ఖాన్ తో ఎప్పుడు నటిస్తారు.. ఆయనతో ఫుల్ లెంగ్త్ హీరోయిన్ గా ఎప్పుడు కనిపించబోతున్నారు అంటూ ప్రశ్నించారు. అందుకు ఆమె సమాధానంగా భారత్ చిత్రంలో నా పాత్ర చిన్నది మరియు పాత్ర ప్రాముఖ్యత రీత్యా నేను నటించాను. కాని భవిష్యత్తులో సల్మాన్ ఖాన్ తో వయసు రీత్యా నటించలేక పోవచ్చు. ఆయన వయసుతో నా వయసు సూట్ అవ్వదు కనుక మళ్లీ ఆయనతో సినిమాలు చేయను.. ఇదే ఆయనతో నా తొలి మరియు చివరి సినిమా అంటూ తేల్చి పారేసింది. సల్మాన్ ఖాన్ వయసు గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ ఈమె అవ్వడంతో ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. మరియు సల్మాన్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో దిశా వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.