Begin typing your search above and press return to search.

కొంప ముంచిన దిశా చీర‌క‌ట్టు!

By:  Tupaki Desk   |   28 April 2019 5:30 PM GMT
కొంప ముంచిన దిశా చీర‌క‌ట్టు!
X
జారుతున్న ప‌విట కొంగు.. వెరైటీ చీర క‌ట్టు గురించి.. నాభి కేంద్రంలో చీర‌ దోపుడు గురించి క‌వులు బోలెడ‌న్ని క‌విత‌లే అల్లారు. అల్ల‌న.. పెద్ద‌న‌.. కాళిదాసులే అయ్యారు. అయితే ఆవిడ ప‌విట కొంగు మ‌హ‌త్తు ఏమో గానీ.. ఏకంగా కార్పొరెట్ గురూలే ప‌ద్యాలు పాడేస్తున్నారు. ఆవిడ ప‌సుపు రంగు చీర ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో హాట్ డిబేట్ అయ్యింది. వ‌స్త్ర వ్యాపార ప్ర‌పంచంలో అదో కుదుపులా మారింది. అక్క‌డ గొప్ప బిజినెస్ గురూజీలు అదే ప‌నిగా ఆవిడ ప‌విట చెంగు స్టైల్ గురించి .. ప‌సుపు చీర‌ను క‌ట్టుకున్న తీరు గురించి.. ర‌క‌ర‌కాలుగా వ‌ర్ణ‌ణ‌లు.. విశ్లేష‌ణ‌లు చేస్తున్నారు. అయితే కొంద‌రు సెటైరిక‌ల్ గా మీమ్స్ తోనూ పంచ్ లు వేస్తున్నారు. ఎంత‌గా మ‌న‌సు ప‌డ‌క‌పోతే ఇంతగా చెప్పుకుంటారు? ఎంత ఇదిగా హృద‌యాల్ని చిద్రం చేయ‌క‌పోతే మ‌రీ అంత లోతైన డిస్క‌ష‌న్ చేస్తారు? ఏమో దిశా ప‌టానీ చీర క‌ట్టు అంత‌గా ప్ర‌భావితం చేసింది మ‌రి. సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌స్తుతం ఒక‌టే మీమ్స్ వెర్రెత్తిస్తున్నాయి.

`భార‌త్` చిత్రం నుంచి స్లోమోష‌న్ సాంగ్ ఇలా రిలీజైందో లేదో అలా స‌ల్మాన్ - దిశా ప‌టానీ అభిమానుల్లోకి ఈ గీతం దూసుకెళ్లిపోయింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా సామాజిక మాధ్య‌మాల్లో చ‌కోర ప‌క్షుల్లా వేచి చూస్తున్న అభిమానుల్లోకి వైర‌ల్ అయిపోయింది ఈ వీడియో గీతం. భాయ్ తో పాటు దిశా ప‌సుపు రంగు చీర‌లో అద్భుత విన్యాసాలే చేసింది. అయితే ఈ పాట‌లో దిశా ప‌టానీ చీర‌క‌ట్టుపై సామాజిక మాధ్య‌మాల్లో.. ఆన్ లైన్ లో బోలెడ‌న్ని సెటైర్లు పేలుతున్నాయి. ఇంతకీ దిశా ప‌టానీ ఒంటిపై అస‌లు చీరెక్క‌డుంది? అంటూ సెటైర్ వేశాడో గురుడు. త‌న వెన‌క బ్యాక్ గ్రౌండ్ లో స్టెప్పులేసిన స్టార్లు ఎంద‌రు ఉన్నా జ‌నాల క‌ళ్ల‌న్నీ దిశా పైనే ఎందుకు వాలాయి.. అంటే త‌న ప‌విట కొంగును చుట్ట‌లా చుట్టేసి ఆ భుజం పైకి రెక్లెస్ గా విసిరేసిన తీరు కుర్ర‌కారును మ‌త్తులోకి దించేసిందంటూ మాట్లాడుకున్నార‌.

ఆ ఒక్క ప‌ని ఎంత ప‌ని చేసిందంటే.. ఏకంగా అవార్డ్ విన్నింగ్ టెక్స్ టైల్ డిజైన‌ర్ గౌర‌వ్ అంత‌టి వాడే అస‌లు ఒంటిపై చీర జీరో అయిపోయింది.. ప్చ్! అంటూ మైమ‌రిచిపోయాడు. ఎప్పుడూ ఒకేర‌కంగా చీర క‌ట్టాలి అన్న రూల్ ఏదైనా ఉందా? ఎవ‌రికి న‌చ్చిన‌ట్టు వాళ్లు క‌ట్టుకుంటారు. కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేస్తారు అంటూ ఆన్ లైన్ లో డిబేట్ జోరుగా సాగింది. చీర‌క‌ట్టును ఒక్కో ప్రాంతంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా క‌డ‌తారు. ఒక‌రు పవిట కొంగును కుడిభుజంపై వేస్తే.. ఇంకొక‌రు ఎడ‌మ భుజం వైపు ఉండేలా క‌ట్టుకుంటారు. అది ఒక్కో సంస్కృతిని బ‌ట్టి మారిపోతోంద‌ని కార్పొరెట్ గురూలు ర‌క‌ర‌కాలుగా స‌మీక్షించారు.

ఎన్ని వెరైటీలు వ‌చ్చినా చీర చీరే. దాని ప్ర‌త్యేక‌త ఎక్క‌డికీ పోదు. అస‌లు కుట్టు అవ‌స‌రం లేని ఏకైక గార్మెంట్ చీర అంటూ పంచ్ లు వేశారు డిజైన‌ర్లు. శారీ గౌన్లు.. లెహెంగా చీర‌లు.. శారీ విత్ జీన్స్ ఒక‌టేమిటి ఎన్నో ఆక‌ర్ష‌ణ‌లు వ‌చ్చాయి ఈ రోజుల్లో. మ‌గువ అందాన్ని ఎలివేట్ చేసే చీర ఒక్కోసారి ఎంత‌గా అందాన్ని ఇనుమడింప జేస్తుందో ఒక్కోసారి గ‌తి త‌ప్పిన డిజైన్ల వ‌ల్ల అంతే ముప్పు తెస్తుంద‌ని ఆన్ లైన్ డిబేట్ తేల్చి చెప్పింది. ఇన్వెన్ష‌న్లు మంచిదే. కానీ గ‌తి త‌ప్ప‌కూడ‌ద‌ని అన్నారు. మొత్తానికి దిశా ప‌టానీ ప‌సుపు చీర‌కు .. ఆ క‌ట్టు బొట్టుకు ఇంత‌గా పాపులారిటీ వచ్చేస్తుంద‌ని ఆ డిజైన‌ర్ సైతం ఊహించి ఉండ‌డు క‌దా!! ఈ పాట‌లో ఆ ప‌ళ్లు క‌వ‌రింగేంటి? అని అడిగేశారు కొంద‌రైతే. దిశా అవతారం 1990లో ర‌వీనా క్లాసిక్ సాంగ్ టిప్ టిప్ బ‌ర్సా పానీని త‌ల‌పించింద‌ని... మాధురి ధీక్షిత్ ధ‌క్ ధ‌క్ కి రిజంబుల్ చేసింద‌ని కామెంట్ల‌ను పోస్ట్ చేశారు.