Begin typing your search above and press return to search.

అన్నయ్యతో సరసం.. చెల్లితో స్నేహం

By:  Tupaki Desk   |   8 Jun 2017 10:32 AM GMT
అన్నయ్యతో సరసం.. చెల్లితో స్నేహం
X
ఎమ్మెస్ ధోని సినిమాలో మద్దుగా మెరిసిన సితార దిశ పటాని ఇప్పుడు తన ఖాళీ సమయంను బాగానే వాడుకుంటోంది. ఎప్పటి నుండో ఈమెపై వస్తున్న ప్రేమ పుకారులకు ఇప్పుడిప్పుడే ఒక రూపం వస్తున్నాయి. టైగర్ ష్రాఫ్‌ తో ప్రేమలో ఉందని టాక్. వీళ్ళు చాలాసార్లు కలిసి పార్టీలు ఫంక్షన్లు జరుపుకుంటున్నారు కూడా. అవన్నీ మనం కూడా ఫోటోల రూపంలో చూస్తూనే ఉన్నాం. కట్ చేస్తే ఇప్పుడు దిశ టైగర్ చెల్లెలు కృష్ణ ష్రాప్‌ తో కలిసి జల్సా చేస్తోంది.

టైగర్ ష్రోఫ్ఫ్ కు వరసపెట్టి సినిమా షూటింగ్లు ఉన్నాయి ఈ ఏడాదిలో. ఇక టైగర్ అందుబాటు లో లేకపోయినా కూడా.. దిశ మాత్రం మ్యాగజైన్ కవర్ పేజీలకు షూట్ చేసుకుంటూ.. వెకేషన్లకు వెళుతోంది. ఇప్పుడు అలాంటి వెకేషన్ కు బాయ్ ఫ్రెండ్ చెల్లితో వెళ్ళింది. వీళ్ళు దిగిన ఫోటో చూస్తే మీకే అర్ధం అవుతుంది దిశ పటాని వీరికి ఎంత సన్నిహితంగా ఉంటుందో. అయితే ఈ మొత్తం యవ్వారాన్ని బాలీవుడ్ మాత్రం అన్నయ్యతో సరసరం చెల్లితో స్నేహం అని అభివర్ణిస్తున్నా కూడా.. మనోళ్ళు మాత్రం అవన్నీ ఏం లేవంటూ కొట్టిపారేస్తున్నారు.

మున్నా మైఖేల్.. రాంబో.. బాఘీ2 వంటి సినిమాలతో బిజీగా ఉన్న టైగర్.. తన సినిమాల కోసం ప్రియురాలను గట్టిగానే సిఫార్సు చేస్తున్నాడు. కాకపోతే అమ్మడు కొంచం ఎక్కువ మొత్తంలో పారితోషకం అడగటం వలన.. అవన్నీ చేజారిపోతున్నాయి. తెలుగులో కూడా అమ్మడు 5 కోట్లు కోట్ చేయడంతో మనోళ్ళు పక్కనెట్టేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/