Begin typing your search above and press return to search.

అంతొద్దమ్మా.. తగ్గాలి!!

By:  Tupaki Desk   |   15 Nov 2017 1:30 PM GMT
అంతొద్దమ్మా.. తగ్గాలి!!
X
లోఫర్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన హాట్ మోడల్ దిశా పటాని. అమ్మడు నటించింది కొన్ని సినిమాల్లోనే అయినా ఇమేజ్ మాత్రం బాగానే సంపాదించుకొంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో చాలా మంది ఫాలోవర్స్ ని పెంచుకుంది. అంతే కాకుండా ఫొటో షూట్స్ తో అమ్మడు ఈ మధ్య షాక్ మీద షాకులను ఇస్తోంది. మొన్నటి వరకు ఓ లిమిట్స్ లో సెక్సీగా కనిపించిన దిశా ఈ మధ్య గ్లామర్ గీతని దాటేస్తోంది అంటున్నారు చూపరులు.

దిశా అందానికి ఫిదా అయ్యేవారు చాలా మంది ఉన్నారు. కానీ అందరిలానే అమ్మడికి నెగిటివ్ కామెంట్స్ కూడా బాగా అందుతున్నాయి. రీసెంట్ గా కొంతమంది దిశా ఫొటో షూట్ పై ఎవరు ఊహించని విధంగా కామెంట్ చేశారు. 'మేడం అందం అనేది శరీరాన్ని చూపించడంలో ఉండదు. దాన్ని ఎంత దాచుకుంటే అంత పెరుగుతుంది' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా మరొకతను.. 'మరి ఇంతలా ఎక్స్ పోజింగ్ వద్దు. కొంచెం తగ్గించు' అని ఎవరికీ వారు తోచినట్టు కామెంట్ చేశారు. ఇక మరొకతను అయితే కెరీర్ పై ముందు దృష్టి పెట్టూ అనేలా కౌంటర్ వేశాడు.

ప్రస్తుతం ఈ న్యూస్ కొన్ని మీడియాలలో హాట్ టాపిక్ గా మారాయి. దిశా కెరీర్ లో ఎన్నడు ఈ విధమైన కామెంట్స్ ని ఎదుర్కోలేదని కొందరు అంటున్నారు. ముఖ్యంగా ఆమె ప్రస్తుతం చేస్తోన్న భాగీ 2 సినిమా హీరో టైగర్ ష్రాఫ్ తో లవ్ లో ఉందని తెలిసినా ఎవరు ఈ స్థాయిలో కామెంట్ చేయలేదు. కానీ ఇప్పుడు ఈ కామెంట్స్ ని చూస్తుంటే దిశా కొంచెం తగ్గితే మంచిదినే సలహాలు వినిపిస్తున్నాయి.