Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: వింక్ గర్ల్ గా మారిన లోఫర్ బ్యూటీ

By:  Tupaki Desk   |   15 Sep 2018 5:17 AM GMT
ఫోటో స్టొరీ: వింక్ గర్ల్ గా మారిన లోఫర్ బ్యూటీ
X
కన్నుకొడితే పాపులర్ అవుతారని ముందే తెలిస్తే హీరోయిన్లందరూ ఈ పాటికి జిమ్ కసరత్తులతో పాటు కన్నుగీటే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉండేవారు. కానీ అన్నీ సార్లు అలాంటివి జరగవు. మరీ ఎక్కువగా ప్రయత్నిస్తే కళ్ళకు కీరా ముక్కలు పెట్టుకొని రిలాక్స్ కావలసి ఉంటుంది. ఏదేమైనా మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా వారియర్ కన్నుగీటిన వీడియో మాత్రం సంచనలం సృష్టించింది. అప్పటినుండి చాలామంది దాన్ని అనుకరిస్తునే ఉన్నారు.

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధి కూడా కన్ను గీటాడు అంటే ప్రియా వీడియో ఎంత పాపులర్ అయిందో మనం అర్థం చేసుకోవచ్చు. రీసెంట్ గా ఒక బాలీవుడ్ బ్యూటీ ఈ ప్రియా వింక్ యాక్ట్ ను అనుకరించింది. ఆమె ఎవరో కాదు 'లోఫర్' సినిమా తో తెలుగు ప్రేక్షకులు పరిచయమైన దిశ పతాని. జస్ట్ కన్ను గీటడం కాదు.. ప్రియ ప్రకాష్ వారియర్ 'ఒరు ఆదార్ లవ్' సినిమాలో ఎలాంటి డ్రెస్ లో కనిపించిందో అలాంటి యూనిఫాం వేసుకొని మరీ కన్నుకొట్టింది. ఇంతకీ ఎందుకు మరీ అంతగా కాపీ కొట్టడం అని మీకు అనుమానం రాలేదా?

దిశా ఈమధ్య ఒక అడ్వర్టైజ్మెంట్ కోసం షూటింగ్ లో పాల్గొంది. అందులో భాగంగానే ప్రియా అవతారం ఎత్తింది. ఇక సినిమాల విషయానికి వస్తే సల్మాన్ ఖాన్ తాజా చిత్రం 'భరత్' లో హీరోయిన్ గా నటిస్తోంది. అలీ అబ్బాస్ జఫార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో టబు - కత్రినా కైఫ్ లు కూడా నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా విడుదల కానుంది.