Begin typing your search above and press return to search.

వైరల్ అవుతున్న బోల్డ్ బ్యూటీ బికినీ అందాలు..

By:  Tupaki Desk   |   29 April 2020 2:30 AM GMT
వైరల్ అవుతున్న బోల్డ్ బ్యూటీ బికినీ అందాలు..
X
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ రోల్ పోషిస్తూ అభిమానులను తన మత్తులో ముంచెత్తడంలో ఈ సుందరిని మించిన సౌందర్యం లేదు. లో-దుస్తులతో కవ్విస్తూ.. తన అందాలన్నీ ఆరబోసే ఈ బోల్డ్ బ్యూటీకి పోటీ ఎవరు లేరేమో అన్పిస్తుంది. ఆమె ఎవరో కాదు.. లోఫర్ సుందరి దిశా పటాని. 'లోఫర్‌' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దిశా.. పలు బాలీవుడ్ సినిమాల్లో నటించి గ్లామర్ బ్యూటీగా పాపులర్ అయింది. సోషల్ మీడియాలో ఆమె పెట్టే ఫోటోలు, వీడియోలు చూస్తే.. ఎక్స్‌పోజింగ్‌ అంటే దిశాదే.. అనే రేంజ్ లో అలరిస్తుంది అమ్మడు. లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన దిశా తాజాగా సోషల్ మీడియాలో తను బీచ్ లో దిగిన బికినీ ఫోటో షేర్ చేసింది. ఇక కుర్రకారు ఊరుకుంటారా.. అలా అప్లోడ్ చేసిందో లేదో.. ఇలా అమ్మడి ఫోటోను షేర్ చేసేస్తున్నారు. ప్రస్తుతం అమ్మడి స్విమ్ సూట్ టైప్ బికినీ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

టాలీవుడ్లో 'లోఫర్' మూవీ తర్వాత బాలీవుడ్ గడపతొక్కిన దిశా.. ''భాగీ 2, ఎంఎస్ ధోని, మలంగ్'' లాంటి సినిమాలు చేసి బీ టౌన్ ప్రేక్షకులను తన బుట్టలో వేసుకుంది. ఇటీవలే సల్మాన్‌కి జోడీగా 'భారత్' చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా నటించి భారీ హిట్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం అదే సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా 'రాధే'లో హీరోయిన్‌గా నటిస్తోంది ఈ గ్లామర్ బ్యూటీ. దిశా పటానికి పెద్దగా సక్సెస్ రేట్ లేకపోయినా బాలీవుడ్ లో అందాల ప్రదర్శనతో నెట్టుకొచ్చేస్తోంది. బికినిలో హాట్ ఫోజుల్లో దిశా పటాని చేస్తున్న ఫోటో షూట్స్ వైరల్ అవుతున్నాయి. కుర్రకారు గుండెల్లో అలజడి సృష్టించేలా దిశాపటాని అందాలు ఆరబోస్తోంది. సినిమా అవకాశాలు తక్కువే అయినప్పటికీ సోషల్ మీడియాలో గ్లామర్ మాత్రం హై రేంజ్ లో ఒలకబోస్తోంది. కొన్నిసార్లు దిశా చేస్తున్న అందాల ఆరబోత విమర్శలకు కూడా దారితీస్తోంది. తాజాగా దిశా పటాని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన బోల్డ్ ఫోజు వైరల్ అవుతోంది.