Begin typing your search above and press return to search.

అభిమాని అడిగాడు.. హీరోయిన్‌ ఆగలేదు! ఒంటి మీది మచ్చను జూమ్ చేసి చూపింది!

By:  Tupaki Desk   |   11 April 2021 3:30 PM GMT
అభిమాని అడిగాడు.. హీరోయిన్‌ ఆగలేదు! ఒంటి మీది మచ్చను జూమ్ చేసి చూపింది!
X
వెండితెర‌పై హీరోయిన్ల‌ది షార్ట్ టైమ్ పీరియ‌డ్‌. దాని కాలప‌రిమితి ఎంత అనేది ఎవ్వ‌రూ ఊహించ‌లేరు. కాబ‌ట్టి.. ఆ టైమ్‌ను పెంచుకోవాలంటే అభిమానుల‌తో టచ్ లో ఉండ‌డం అన్నిటిక‌న్నా ప్ర‌ధానం. ఏడాదికి వ‌చ్చే రెండు మూడు సినిమాల‌తో వారితో రిలేష‌న్ స‌క్ర‌మంగా సాగ‌దు. అందుకే.. ప్ర‌తీ హీరోయిన్ సోష‌ల్ మీడియాలో అందుబాటులో ఉంటుంది. డెబ్యూ బ్యూటీ నుంచి స్టార్ హీరోయిన్ వ‌ర‌కు సామాజిక మాధ్య‌మాల ద్వారా అభిమానుల‌తో మాట్లాడుతుంటారు.

అలాంటి వారిలో ముందు వ‌ర‌స‌లో ఉంటుంది బాలీవుడ్ బ్యూటీ దిశా ప‌ఠానీ. ఎంఎస్. ధోనీ సినిమా ద్వారా దేశ‌వ్యాప్తంగా పాపుల‌ర్ అయిన దిశా.. ఆ త‌ర్వాత వ‌రుస ఆఫ‌ర్ల‌ను సొంతం చేసుకుంది. కుంగ్ పూ యోగా, భాగీ-2, భాగీ-3, భార‌త్ వంటి ఎన్నో చిత్రాలతో స‌త్తా చాటింది. ప్ర‌స్తుతం స‌ల్మాన్ తో ‘రాధే’ చిత్రంలో నటిస్తోందీ బ్యూటీ.

అయితే.. తరచూ సోష‌ల్ మీడియాలో ఫాలోవ‌ర్లతో ట‌చ్ లో ఉండే దిశా.. త‌ర‌చూ క్వ‌శ్చ‌న్ అండ్ ఆన్స‌ర్ సెష‌న్ నిర్వ‌హిస్తూ ఉంటుంది. రెండు రోజుల క్రితమే ఓ సెష‌న్ కంప్లీట్ చేసింది. ఈ సెష‌న్లో ‘మిమ్మ‌ల్ని ప్ర‌త్యేకంగా చూపించేది ఏదీ?’ అని అడిగాడు ఓ అభిమాని.

దానికి త‌న కంటి కింద ఉన్న పుట్టు మ‌చ్చ త‌న‌ను ప్ర‌త్యేకంగా నిలుపుతుంద‌ని చెప్పింది దిశా ప‌ఠానీ. అంతేకాదు.. సెల్ఫీ తీసి మ‌రీ ఆ ఫొటోను పోస్టు చేసింది. ఆ ఫొటోను జూమ్ చేసి, త‌న కంటి కింద ఉన్న పుట్టుమచ్చ‌ను స‌ర్కిల్ చేసి చూపించింది.