Begin typing your search above and press return to search.
డిస్నీ+హాట్ స్టార్ 'మన వినోద విశ్వం' ను పరిచయం చేసిన రామ్ చరణ్..!
By: Tupaki Desk | 18 Sep 2021 11:30 AM GMTప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫారమ్ డిస్నీ+ హాట్ స్టార్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను ఆకర్షించడానికి ఫ్రెష్ కంటెంట్ ని అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఓటీటీ సంస్థల హవా నడుస్తుండటంతో.. ఇన్నాళ్లుగా ప్రాంతీయ భాషల మీద అంతగా ఫోకస్ పెట్టని ఓటీటీలు కూడా ఇప్పుడు కొత్త అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలుగు కంటెంట్ పై దృష్టి పెడుతోన్న డిస్నీ హాట్ స్టార్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది.
'మన వినోద విశ్వం' అనే ట్యాగ్ లైన్ తో డిస్నీ హాట్ స్టార్ ను రామ్ చరణ్ ప్రమోట్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు సినీ ప్రేక్షకులను మెప్పించేందుకు, అలరించేందుకు ఓటీటీ దిగ్గజం అన్ని రకాలుగా ప్రణాళికలను సిద్దం చేసింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి చిత్రాలను డబ్బింగ్ చేసి తెలుగు ప్రేక్షకులకు అందించడంతో పాటుగా టాలీవుడ్ టాప్ స్టార్ హీరోల సినిమా హక్కులను సొంతం చేసుకుని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తున్నారు. అంతేకాకుండా వీవో ఐపిఎల్-2021.. ఐసీసీ టీ20 వరల్డ కప్-2021ను కూడా తెలుగు వారికి అందిసస్తున్నారు. డిస్నీ హాట్ స్టార్ 'మన వినోద విశ్వం' ప్రమోషనల్ కార్యక్రమానికి అక్కినేని నాగార్జున - రామ్ చరణ్ - నితిన్ - తమన్నా - నభా నటేష్ లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా డిస్నీ హాట్ స్టార్ సంస్థ కంటెంట్ హెడ్ సౌరవ్ బెనర్జీ మాట్లాడుతూ.. ''ఇండియాలోని కంటెంట్ను కొత్త పుంతలు తొక్కించేందుకు మేం ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటాం. ఇక ఇప్పుడు తెలుగు వినోద ప్రపంచంలోకి అడుగుపెడుతున్నందుకు సంతోషంగా ఉంది. మా ప్రేక్షకుల కోసం మరింత విభిన్నమైన కంటెంట్ ను అందించేందుకు క్రియేటివ్ మైండ్స్ తో జత కడుతున్నాం. ఇప్పటికే 'మాస్ట్రో' 'అనబెల్లె సేతుపతి' వంటి చిత్రాలను అందించాం. ప్రస్తుతం ప్రాంతీయ కంటెంట్ కు ఉన్న ఆదరణ అందరికీ తెలిసిందే. గత ఏడాది తమిళంలో అడుగుపెట్టి సక్సెస్ సాధించాం. ఇక ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు వస్తున్నాం'' అని అన్నారు.
రామ్ చరణ్ మాట్లాడుతూ.. ''ఇండియాలో కంటెంట్ కు దిక్సూచిలా డిస్నీ హాట్ స్టార్ నిలుస్తోంది. ఏ క్లాస్ గ్లోబల్, ఇండియన్, ప్రాంతీయ భాషల చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తోంది. సినిమాలే కాకుండా వివిధ భాషల్లో వెబ్ సిరీస్ లను తీసుకొస్తోంది. తెలుగు ఎంటర్టైన్మెంట్ మార్కెట్ లోకి డిస్నీ హాట్ స్టార్ ప్రవేశిస్తుండటంతో టాలీవుడ్ లోని మేకర్స్, నటులకు అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను. డిస్నీ హాట్ స్టార్ తెలుగు వినోద ప్రేమికులను తమ కంటెంట్ తో అలరిస్తుందని నమ్ముతున్నాను'' అని తెలిపారు.
కాగా, డిస్నీ హాట్ స్టార్ లో ఇటీవల నితిన్ - నభా నటేష్ - తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన 'మాస్ట్రో' సినిమా విడుదలై మంచి ఆదరణ తెచ్చుకుంటోంది. అలానే విజయ్ సేతుపతి -తాప్సీ కాంబోలో వచ్చిన 'అనబెల్లె సేతుపతి' కూడా తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. వీటితో పాటుగా స్వాతంత్రోద్యమం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన 'అన్ హర్డ్' వెబ్ సిరీస్ కూడా ప్రసారం అవుతోంది. హైదరాబాద్ స్టేట్ విలీనంపై అప్పటి పరిస్థితుల ఆధారంగా ఆదిత్య కేవీ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ ను రాధికా లావు - ఎల్లనర్ ఫిల్మ్స్ కలిసి నిర్మించారు. ఇవే కాకుండా 'ఘర్షణ' '9 అవర్స్' 'ఝాన్సీ' వంటి సినిమాలు కూడా తెలుగులోకి అందుబాటులోకి వచ్చాయి. రియాల్టీ షో అభిమానులను ఆకట్టుకునేందుకు కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న 'బిగ్ బాస్ 5' షో కూడా అందుబాటులో ఉంది. హాట్ స్టార్ యొక్క 'మన వినోద విశ్వం' కార్యక్రమానికి ఇది విజయవంతమైన ప్రారంభమనే అనుకోవాలి.