Begin typing your search above and press return to search.

అవతార్ నాలుగు సీక్వెల్స్ కూడా 'క్రిస్మస్'కే విడుదల!!

By:  Tupaki Desk   |   24 July 2020 4:30 PM GMT
అవతార్ నాలుగు సీక్వెల్స్ కూడా క్రిస్మస్కే విడుదల!!
X
ప్రపంచ వ్యాప్తంగా వీరాభిమానులు సొంతం చేసుకున్న సినిమాలలో హాలీవుడ్ అవతార్ మూవీ ఒకటి. 2009లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సంచలనం సృష్టించింది. విడుదలైన అన్నీ దేశాలలో, అన్నీ బాషలలో రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టి థియేటర్లలో సత్తా చాటింది. టైటానిక్ డైరెక్టర్ జేమ్స్ కామరూన్ అద్భుత సృష్టి.. అత్యద్భుత విజన్ ఈ అవతార్. సైంటిఫిక్ ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన అవతార్.. ఆ ఏడాది ఆస్కార్ అవార్డులను కూడా కొల్లగొట్టింది. అయితే అవతార్ మూవీ వచ్చి పదేళ్లు గడుస్తున్నా సీక్వెల్ మూవీ ఇంకా రాలేదు. ఎప్పుడో అవతార్ విడుదలైన నాలుగేళ్లలో సీక్వెల్ సిద్ధం చేస్తానని చెప్పిన జేమ్స్ కామరూన్.. పదేళ్లు ముగిసినా ఒక సీక్వెల్ కూడా విడుదల చేయలేదు.

ఇంకా అవతార్ మూవీకి కేవలం ఒక సీక్వెల్ మాత్రమే కాదు. సెకండ్, థర్డ్, ఫోర్, ఫిఫ్త్ పార్ట్స్ కూడా సిద్ధం అవుతుండటం విశేషం. ప్రస్తుతం కరోనా వలన ప్రపంచం అల్లకల్లోలం అవుతుండటం వలన ఈ సినిమా సీక్వెల్ షూటింగ్ మరింత ఆలస్యం అవుతూ వస్తుంది. ఇప్పటికే మేజర్ పార్ట్ ముగిసిన సీక్వెల్ షూటింగ్ ప్రస్తుతం న్యూజిలాండ్ దేశంలో జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా చిత్ర నిర్మాణ ఫార్మాలిటీలు మొత్తానికి మారిపోయాయి. ప్రొడక్షన్ హౌస్‌లు సాధారణ స్థితికి చేరినప్పటికీ.. ఈ హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ బ్లాక్‌బస్టర్ అవతార్‌కు సీక్వెల్ కోసం వీరాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అవ‌తార్ సినిమా సీక్వెల్ పనులు ప్రారంభించారు జేమ్స్ కామెరూన్‌.

అందుకోసం 50 మంది టెక్నీషియన్లతో కలిసి గత నెలలోనే న్యూజీలాండ్ చేరుకొన్నారు. న్యూజిలాండ్ దేశంలోని వెల్లింగ్టన్‌ చేరుకున్న తర్వాత అక్కడి ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. అవతార్ చిత్రబృందం అంతా 14 రోజుల సెల్ఫ్‌ హోం క్వారంటైన్‌లోకి వెళ్లి.. ఆ తర్వాత తాజాగా అవ‌తార్-2 సినిమా షూటింగ్ మొద‌లు పెట్టారు. ఇక తాజాగా సోషల్ మీడియాలో అవతార్ సీక్వెల్ పార్ట్స్ విడుదల తేదీలను డిస్నీ ప్రకటించినట్లుగా తెలుస్తుంది. దాని ప్రకారం.. 2022 డిసెంబర్ 16న అవతార్-2, 2024 డిసెంబర్ 20న అవతార్-3, 2026 డిసెంబర్ 18న అవతార్-4, అలాగే 2028 డిసెంబర్ 22న అవతార్-5 విడుదల కానున్నాయి. అయితే అన్నీ సీక్వెల్స్ కూడా క్రిస్మస్ సందర్భంగా విడుదల అవుతుండటం విశేషం.