Begin typing your search above and press return to search.

బ్రహ్మాస్త్ర: డిస్నీ వారికి పనులు అప్పగించే ఆలోచనలో కరణ్ జోహార్

By:  Tupaki Desk   |   20 April 2020 7:50 AM GMT
బ్రహ్మాస్త్ర: డిస్నీ వారికి పనులు అప్పగించే ఆలోచనలో కరణ్ జోహార్
X
బాలీవుడ్లో 'బ్రహ్మాస్త్ర 3D' పేరుతో ఒక భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్.. అలియా భట్.. అమితాబ్ బచ్చన్ లు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కథ ఎలాంటిది అనేది పక్కన పెడితే ఈ సినిమాను పూర్తి చేసేందుకు హాలీవుడ్ నిపుణులపై ఆధార పడుతున్నారని సమాచారం అందుతోంది.

నిజానికి ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇక్కడే జరగాల్సి ఉంది కానీ ఇప్పుడు మాత్రం ఆ పని అంత హాలీవుడ్ టెక్నీషియన్స్ కు అప్పగించాలనే ఉద్దేశంతో ఉన్నారని అంటున్నారు. ఇక్కడ లాక్ డౌన్ కారణంగా పనులన్నీ ఆగిపోవడంతో డిస్నీ వారికి ఈ వర్క్ అంతా అప్పగించాలని అనుకుంటున్నారట. ఈ సినిమాకు 'బాహుబలి' కి పనిచేసిన డైరెక్షన్ టీం.. 'సాహో' సినిమాకు పనిచేసిన ఎడిటింగ్ టీమ్ ను తీసుకున్నారని అంటున్నారు.

ముందుగా అనుకున్న రిలీజ్ డేట్ ప్రకారం ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 4 న విడుదల కావలసి ఉంది. ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా ఆ పనులన్నీ నిలిచిపోయాయి. అయితే ఈ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ఎక్కువగా ఉండడం తో.. లాక్ డౌన్ ఎక్కువ రోజులు కొనసాగితే అనుకున్న సమయానికి ఫస్ట్ కాపీ చేతికొచ్చే అవకాశం లేదట. అందుకే హాలీవుడ్ సంస్థ పై ఆధారపడాలని కరణ్ జోహార్ నిర్ణయం తీసుకున్నారట. ఈ లెక్కన 'బ్రహ్మాస్త్ర' ముందుగా అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.