Begin typing your search above and press return to search.

మెంటల్ డైరెక్టర్ సూసైడ్.. ఏందీ గొడవ?

By:  Tupaki Desk   |   11 Sep 2016 5:30 PM GMT
మెంటల్ డైరెక్టర్ సూసైడ్.. ఏందీ గొడవ?
X
సోలో హీరోగా శ్రీకాంత్ పని అయిపోయిందని అనుకుంటున్న సమయంలో.. ఈ ఏడాది ప్రారంభంలో టెర్రర్ మూవీతో సక్సెస్ కొట్టాడు ఈ సీనియర్ హీరో. అటు కేరక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో పాటు ఇటు సోలో హీరోగానూ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. శ్రీకాంత్ హీరోగా మెంటల్ పోలీస్ అనే టైటిల్ పై మూవీ రూపొందగా.. పోలీసుల అభ్యంతరాలతో చివరకు ఈ మూవీ మెంటల్ గా పేరు మార్చుకుంది. ఇప్పుడీ మూవీ డైరెక్టర్ వ్యవహారం వివాదంగా మారింది.

ఈ సినిమా ఫస్ట్ లుక్ రివీల్ చేసినప్పుడు దర్శకుడిగా కరణం పి. బాబ్జీ పేరు పోస్టర్లలో కనిపించింది. టీజర్ లో కూడా ఈ పేరే ఉంది. కానీ ఈ శుక్రవారం థియేటర్లలోకి మెంటల్ వచ్చేసరికి.. డైరెక్టర్ పేరు మారిపోయింది. నేమ్ క్రెడిట్స్ లో డైరెక్షన్- బషీద్ అని పడింది. దీంతో ఫిలిం ఛాంబర్ ని ఆశ్రయించాడు దర్శకుడు బాబ్జీ. అయితే సినిమా నిర్మాత కంప్లెయింట్ చేస్తేనే యాక్షన్ తీసుకోగలమని వాళ్లు చెప్పడంతో ఇప్పుడీ దర్శకుడు న్యాయం కోసం పోరాడుతానంటున్నాడు.

తను స్వయంగా 5లక్షలకు పైగా ఇన్వెస్ట్ మెంట్ తోపాటు.. ఏడాదిన్నర కష్టపడ్డానని చెప్పిన బాబ్జీ.. హీరో శ్రీకాంత్ ని కూడా అప్రోచ్ అయినా ఫలితం దక్కలేదని చెబుతున్నాడు. ఇవాల్టి నుంచి సినిమా క్రెడిట్స్ లో తన పేరు పడకపోతే బషీద్ ఇంటి ముందు సూసైడ్ చేసుకుంటానని చెబుతున్నాడు. అయితే.. ఇప్పటికే ఫ్లాప్ టాక్ వచ్చిన మూవీకి ఇంత హంగామా అవసరమే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.