Begin typing your search above and press return to search.
సీతకు వివాదాల గోల షురూ
By: Tupaki Desk | 23 May 2019 1:30 AM GMTబెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాజల్ అగర్వాల్ రెండోసారి జోడి కట్టిన సీత ఎల్లుండి థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఇప్పటికే ట్రైలర్ ఆసక్తి రేపగా అంచనాలు బాగానే నెలకొన్నాయి. అంతా సైలెంట్ గా జరిగిపోతోందనుకుంటున్న తరుణంలో సీతకు వివాదాల గోల మొదలైపోయింది. ఇందులో సీత పాత్రను చిత్రీకరించిన తీరు చెప్పిన డైలాగ్స్ అన్ని హిందూ మనోభావాలను దెబ్బ తీసేలా ఉన్నాయంటూ బిజెఎంవై అనే సంస్థ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
రిలీజ్ ఆపాల్సిందే అంటూ లేకపోతే తమ నిరసన ఎదురుకునేందుకు సిద్ధంగా ఉండాలని చెబుతోంది. సాధారణాంగా కోర్ట్ కు వెళ్తే తప్ప సినిమాలు వాయిదా పడే ఛాన్స్ లేదు. అందులోనూ సీత కమర్షియల్ సినిమా. పురాణాలను ఆధారంగా చేసుకుని రూపొందించింది కాదు. సో ఇప్పుడీ వివాదం పబ్లిసిటీకి ఎంతో కొంత ఉపయోగపడాలి తప్పించి అంతకు మించి జరిగేది ఏమి ఉండకపోవచ్చు.
దర్శకుడు తేజ దీని గురించి ఇంకా స్పందించలేదు. టీజర్ లో రావణాసురుడు సీత ఎత్తుకెళ్ళడం తప్పు కాదు రాముడి భార్యను తీసుకెళ్లడం తప్పు అనే డైలాగ్ మీద సోషల్ మీడియాలో మినీ యుద్ధమే జరిగింది. తర్వాత సద్దుమణిగింది కానీ ఇప్పుడీ ఫ్రెష్ వివాదంతో సీత రిలీజ్ ఏమైనా మలుపులు తిరుగుతుందేమో చూడాలి . మహర్షి వేడి బాగా చల్లారిన నేపధ్యంలో ఈ అవకాశాన్ని సీత కనక సరిగ్గా వాడుకుంటే మంచి వసూళ్లు రాబట్టుకోవచ్చు