Begin typing your search above and press return to search.

హీరోల‌కు రెండంకెల ప్యాకేజీలు.. హీరోయిన్ల‌కు బిస్కెట్లు!

By:  Tupaki Desk   |   29 Dec 2022 3:58 AM GMT
హీరోల‌కు రెండంకెల ప్యాకేజీలు.. హీరోయిన్ల‌కు బిస్కెట్లు!
X
హీరోల‌కు ధీటుగా పారితోషికాలు చెల్లించాల‌ని కోరుకునే క‌థానాయిక‌ల జాబితా అంత‌కంత‌కు పెరుగుతోంది. హాలీవుడ్ హీరోయిన్ల త‌ర‌హాలోనే స‌మాన‌త్వం కావాల‌ని కోరుకుంటున్నారు. ఈ జాబితాలో సౌత్- నార్త్ క‌నెక్టివిటీ ఉన్న‌ పలువురు అగ్ర క‌థానాయిక‌లు ఉన్నారు. కంగ‌న ర‌నౌత్ - క‌రీనా క‌పూర్- క‌త్రిన‌ స‌హా ప‌లువురు అగ్ర క‌థానాయిక‌లు పారితోషికాల్లో క‌థానాయిక‌ల‌పై చిన్న చూపు చూస్తార‌ని మేక‌ర్స్ ని సూటిగా ప్ర‌శ్నిస్తూ.. ప‌లుమార్లు బ‌హిరంగ వేదిక‌ల‌పైనే నిల‌దీశారు.

ఈ జాబితాలో ఇప్పుడు త‌మ‌న్నా- భూమి పెడ్నేక‌ర్- ర‌కుల్ ప్రీత్- హ్యూమా ఖురేషి లాంటి క‌థానాయిక‌లు కూడా చేరారు. 'వేతన సమానత్వం' అనే టాపిక్ పై ప్ర‌ముఖ మీడియా నిర్వ‌హించిన డిబేట్ లో పాల్గొన్న ఈ భామ‌లు ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించారు. ఏదైనా సినిమాకి రూ.125 కోట్ల బ‌డ్జెట్ అనుకుంటే దాని నుంచి రెండంకెల మొత్తం హీరో ఖాతాలోకి చేరుతుంద‌ని .. హీరోయిన్ల‌కు మాత్రం థ్యాంక్స్ చెబుతార‌ని వ్యంగ్యంగా పంచ్ వేసింది భూమి పెడ్నేక‌ర్. వేతన సమానత్వం గురించి జ‌రిగిన‌ చర్చ లో గత కొన్ని సంవత్సరాలుగా పరిస్థితులు మారాయని స‌ద‌రు నాయిక‌లు ఈ స‌మావేశంలో అంగీక‌రించారు.

తమ్మనా భాటియా మాట్లాడుతూ.. ఈ రంగంలో మ‌హిళ‌లు కెరీర్ ప‌రంగా ముందుకు సాగడానికి బలమైన మార్కెట్ ను నిర్మించుకోవాలని ఆకాంక్షించ‌గా... వేతన సమానత్వం పరంగా తాము కొంత‌ ముందున్నామని రకుల్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. కానీ దీనిని ఖండిస్తూ భూమి పెడ్నేకర్ పారితోషికంలో వైవిధ్యం గురించి స‌హ‌చ‌రుల‌ను ప్ర‌శ్నించారు. "రూ. 100 కోట్లు రూ.200 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన చాలా సినిమాల్లో నేను న‌టించాను. కానీ నా హీరోకి ఇచ్చిన పారితోషికానికి ద‌రిదాపుల్లో నా రెమ్యున‌రేష‌న్ లేదు. పైగా వారు నాకు కృత‌జ్ఞ‌త‌లు చెబుతారు!" అని భూమి త‌న‌లోని క‌ల‌త‌ను బ‌హిర్గ‌తం చేసింది. "నా న‌ట‌న‌కు ప్రశంస‌లు అందుకుని ఉండొచ్చు.. కానీ హీరోకి చెల్లించే వేతనానికి దగ్గరగా నాకు చెల్లించరు!.. మార్పు అన్ని మూలల‌ నుంచి రావాల"ని భూమి పెడ్నేక‌ర్ కోరారు.

అయితే అసమానత అనేది పశ్చిమం(వెస్ట్ర‌న్ దేశాలు)లో కూడా ఉంది. అయితే అక్కడి పురుషులు మహిళలకు అండగా నిలిచారు. మేల్ ఆర్టిస్టుకు స‌మానంగా రెమ్యునరేషన్ తీసుకుంటామని అక్క‌డ క‌థానాయిక‌లు అడుగుతారు. హీరో ఎవరైనా నా హీరో నా కోసం అండ‌గా నిలవాలని నేను కోరుకోక‌పోయినా త‌మ‌కు తాముగా వారుగా నాకు స‌హ‌క‌రించాలి. దీనిని వారంతా ఒక‌ సమస్యగా గుర్తించాలి" అని భూమి త‌న అభిప్రాయం తెలిపారు.

అయితే కొన్నేళ్లుగా క‌ఠోరంగా శ్ర‌మించి మేల్ స్టార్స్ లేదా క‌థానాయ‌కులు... తమకంటూ ఒక మార్కెట్ ను సృష్టించుకున్నారని హుమా ఖురేషి అన్నారు. హీరోలు సంవత్సరాలుగా మార్కెట్ ను సృష్టించుకున్నారని కూడా మనం అర్థం చేసుకోవాలి. వాళ్లు 100 సినిమాల‌తో మెప్పించ‌గ‌లిగితే మ‌నం క‌నీసం 10 సినిమాల‌తో(నాయికా ప్ర‌ధాన చిత్రాలు) అయినా మెప్పించ‌లేం! అని వాస్త‌వాన్ని హ్యూమా నిజాయితీగా మాట్లాడారు.

క‌థానాయకులు రెండంకెల పారితోషికాలు అందుకుని నాకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపేవారు. త‌మ‌ను న‌మ్మి సినిమాలో భాగ‌మైనందుకు ధ‌న్య‌వాదాలు త‌ప్ప ఏమీ ఉండ‌దు. కానీ వారు ప్ర‌తిసారీ దానిని అవకాశంగా భావిస్తారు....!! అని మ‌రోసారి భూమి పెడ్నేక‌ర్ స్వ‌రం వినిపించ‌గా... ఇంత‌లోనే నటీమణులు రీప్లేస్ అయ్యే అవకాశం ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల ఆట‌లు సాగ‌వ‌ని రకుల్ ప్రీత్ సింగ్ వాస్త‌వాన్ని ఈ వేదిక‌పై గుర్తు చేసారు.

భూమి ఫెడ్నేక‌ర్ కెరీర్ పరంగా రాకెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. కొత్త సంవ‌త్సరంలో వ‌రుస‌గా క్రేజీ చిత్రాల్లో న‌టిస్తోంది. ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్ర‌స్తుతం జాకీ భ‌గ్నానీతో ప్రేమ‌లో ఉంది. సౌత్ లో భార‌తీయుడు 2లో న‌టిస్తోంది. హిందీలోను భ‌గ్నానీల బ్యాన‌ర్ సినిమాలు చేస్తోంది. హ్యూమా ఖురేషి బాలీవుడ్ లో క్రేజీ నాయిక‌గా వెలిగిపోతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే స్టార్ డ‌మ్ ని ఆస్వాధించిన నాయిక‌లు వేత‌న స‌మాన‌త్వం అనే టాపిక్ పై త‌మ అభిప్రాయాల‌ను కుండ‌బ‌ద్ధ‌లు కొట్టారు. ఈ స‌మావేశం ఆస‌క్తిని క‌లిగించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.