Begin typing your search above and press return to search.
టీవీ మూవీ ఎన్నికల్లో డబ్బు పంపిణీ?
By: Tupaki Desk | 25 Nov 2021 7:43 AM GMTఎలక్షన్ అంటే ఎలక్షనే..! అది ఎక్కడైనా కానీ డబ్బు పంపిణీ తప్పనిసరి. జనరల్ ఎలక్షన్ అయినా .. ఆర్టిస్టుల ఎలక్షన్ అయినా డబ్బు పంచనిదే ఓటేయరు. ఇంతకుముందు మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) లో గెలుపు కోసం డబ్బు పంపిణీ తో పాటు మందు ముక్క పార్టీలు ఏర్పాటు చేయడంపై గుసగుసలు వినిపించాయి.
ఇప్పుడు ఇదే తీరుగా టీవీ మూవీ ఆర్టిస్టుల సంఘంలో కూడా తాయిలాల మ్యాటర్ వినిపిస్తోంది. దాదాపు 900 మంది సభ్యులు ఉన్న టీఎంటీఏయు(ఆర్టిస్టుల) అసోసియేషన్ కి డిసెంబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. గత అధ్యక్షుడు 30 ఇయర్స్ పృధ్వీ రాజ్ పదవీ కాలం ముగిసింది. కమిటీని రద్దు చేసి జనరల్ బాడీ మీటింగ్ అనంతరం ఎలక్షన్స్ డేట్ ప్రకటించారు. ఇప్పటికే అభ్యర్థుల ప్రచారం పరాకాష్టకు చేరుకుంది.
తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసారు. ``గౌరవనీయులైన tmtau యూనియన్ సభ్యులకు ఎలక్షన్ కన్వీనర్ కామేశ్వరరావు ఎలక్షన్ కమిటీ సభ్యులు నిర్ణయం మేరకు ఎలక్షన్ డేట్ ప్రకటిస్తున్నాము`` అంటూ వివరాల్ని వెల్లడించారు.
21-11-2021 అలాగే 22-11-2021 ఈ రెండు రోజులు నామినేషన్స్ స్వీకరిస్తారు. 23-11-2021 అండ్ 24-11-2021 ఈ రెండు రోజులు నామినేషన్ ఉపసంహరిస్తారు. 05-12-2021 ఎలక్షన్ జరుపుటకు నిర్ణయించారని Tmtau ఎలక్షన్ కమిటీ ప్రకటించింది.
ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ నెలకొంది. ప్రధాన అభ్యర్థి కామెశ్వరరావు మాట్లాడుతూ-`` తెలంగాణ మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్ యూనియన్ సభ్యులకు వినయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 5/12/21 తేదీ నాడు అనగా ఆదివారం నాడు మన యూనియన్ లో జరుగు ఎన్నికలలో ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఎం కామేశ్వరరావు (కామేష్ గౌడ్) అను నేను మీ ముందుకు మీకు సేవ చేయడానికి ఒక అవకాశం కల్పిస్తారు అన్న ఉద్దేశంతో ఇన్ని రోజులు ఎందరికో అవకాశం కల్పించారు.
అందులో కొంతమంది సేవ చేయగలిగారు మరికొంతమంది సేవ చేయగలిగిన చేయలేక తప్పించుకు తిరిగారు. మన యూనియన్ ని ముందుకి తీసుకువెళ్ళటానికి మా వంతు సహాయంగా మేము ఏం చేయగలుగుతాము అనేది మా మేనిఫెస్టో ని చూసి ఆలోచించండి.
అలాగే అధికారం లేకుండానే ఎన్నో సేవా కార్యక్రమాలు మరెన్నో యూనియన్ కి సంబంధించి కార్యక్రమాలు పాలు పంచుకున్నాం. మాకు ఒక్క అవకాశం ఇచ్చి మా ఫ్యానల్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించి పూర్తిగా మీకు అందుబాటులో ఉండే నాయకులను మీరు ఆచితూచి ఎన్నుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను`` అని అన్నారు.
ఈసారి 30 ఇయర్స్ పృథ్వీ అండతో శుభోదయం సుబ్బారావు అధ్యక్షుడిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ వర్గం కూడా ఇదే తీరుగా హామీల్ని ఇచ్చింది. యూనియన్ ఎన్నికలలో ట్రెజరర్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను .. అలాగే ప్రెసిడెంట్ అభ్యర్థిగా రాజశేఖర్ గారు (శుభోదయం సుబ్బారావు గారు) పోటీ చేస్తున్నారు. మా ప్యానల్ అందరూ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నామని ఓటు వేసి గెలిపించాలని బోయిడి నూకరాజు (ఆర్టిస్ట్) అభ్యర్థించారు.