Begin typing your search above and press return to search.
ఆ వ్యవస్థను రద్దు చేయాలని కోరిన పంపిణీదారులు
By: Tupaki Desk | 8 Aug 2022 3:55 AM GMTఆగస్టు-1 నుంచి టాలీవుడ్ షూటింగుల బంద్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పరిశ్రమలో చాలా సమస్యల్ని పరిష్కరించేవరకూ నిర్మాతలే స్వయంగా ఈ బంద్ ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. నిర్మాతల గిల్డ్ ప్రస్తుతం దీనిపై సమీక్షా సమావేశాలను నిర్వహిస్తోంది.
సమస్యలపై కూలంకుశంగా చర్చించేందుకు సినిమా షూటింగ్ లను తాత్కాలికంగా నిలిపివేసారు. ఈ నేపథ్యంలో ఈ ఆదివారం నాడు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు ఫిల్మ్ ఛాంబర్ లో కీలక సమావేశం నిర్వహించారు. సమావేశంలో చర్చించిన కీలక అంశాలు ఇలా ఉన్నాయి.
సమీక్షా సమావేశంలో చర్చల ప్రకారం N.R.A వ్యవస్థను నిలిపివేయాలనే డిమాండ్ ప్రముఖంగా వినిపించింది. OTT కోసం 8 వారాల విండోను ఖచ్చితంగా అనుసరించాలి. ముందస్తు OTTని ఎంచుకోవడానికి ప్లాన్ లు ఉంటే 30 శాతం మేర పంపిణీదారుకు తిరిగి ఇవ్వాలి.
అలాగే మల్టీప్లెక్స్ లలో 60-40 రెవెన్యూ శాతంపైనా చర్చ జరిగింది. పూర్తి ప్రాతిపదికన GSTని చేర్చాలనే ప్రతిపాదన కూడా ఉంది. నిర్మాత తన తదుపరి చిత్రాన్ని విడుదల చేసే ముందు పంపిణీదారుల నుండి నిర్మాతలు తీసుకున్న అడ్వాన్స్ లను తిరిగి చెల్లించాలి.
అలాగే పోస్టర్లు పబ్లిసిటీ విషయంలో క్లారిటీ ఇవ్వాలని నిర్మాతలను డిస్ట్రిబ్యూటర్లు కోరారు. నైజాం నుంచి ఏషియన్ సునీల్... కృష్ణ నుంచి సాయిబాబా.. సీడెడ్ నుంచి నాగార్జున... గుంటూరు నుంచి సుధాకర్.. నెల్లూరు నుంచి హరి.. ఫిల్మ్ ఛాంబర్ ఉపాధ్యక్షుడు ముత్యాల రాందాస్ తదితరులు సమావేశానికి హాజరయ్యారు.
తిరిగి వెనక్కి ఇవ్వకూడని అడ్వాన్సుల నుంచి కూడా నష్టాల శాతాన్ని బట్టి ఇటీవల నిర్మాతలు కొంత వెనక్కి ఇస్తున్నారు. దీనివల్ల పంపిణీదారు ఒక్కసారిగా నష్టాల భారిన పడకుండా కాపాడడం సాధ్యమవుతోంది. అజ్ఞాతవాసి సినిమా నుంచి ఈ వ్యవస్థ మొదలైందని చెబుతున్నారు. ఇటీవల పంపిణీదారులు ధైర్యంగా పెద్ద సినిమాలను రిలీజ్ చేస్తున్నారంటే ఎంతో కొంత వెనక్కి వస్తుందన్న ధీమావల్లనే. ఇప్పుడు ఎన్.ఆర్.ఏ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలనే డిమాండ్ వచ్చింది.
ఎన్ఆర్ఎ పద్దతి వద్దనుకుని అడ్వాన్స్ మీద పంపిణీ చేయాలనే నిర్ణయం రెండు వైపులా పదునైన కత్తి లాంటిది. పంపిణీదారుకు దీనివల్ల రిస్క్ ఉంటుంది. లాభాలొచ్చినా అంతే స్పష్టత ఉంటుంది. ఇక నిర్మాతలు ఇలా కాకుండా ఒక ఔట్ రేటుకు తమ సినిమాను పంపిణీదారుకే కట్టబెడితే రిస్క్ త పని లేకుండా హాయిగా ఉండొచ్చు. లాభనష్టాలతో అతడికి ఇక సంబంధం ఉండదు. లేదా డేట్ పరిమితి ప్రకారం డబ్బును వెనక్కి ఇవ్వాలి. ఆ టైమ్ దాటితే వడ్డీలు చెల్లించాలి. ఔట్ రేటుకు కొనుక్కుంటే పంపిణీదారుతో ఇలాంటి చిక్కులేవీ నిర్మాతకు ఉండవు.