Begin typing your search above and press return to search.

# వై బాహుబలి కిల్లింగ్ ఆడియన్స్?

By:  Tupaki Desk   |   27 April 2017 11:08 AM GMT
# వై బాహుబలి కిల్లింగ్ ఆడియన్స్?
X
మామూలుగా బాహుబలి సినిమా అభిమానుందరూ ఇప్పుడు వస్తున్న రెండో భాగాన్ని చూడాలనుకోవడానికి ముఖ్యం కారణం.. వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనే. కాని ఇప్పుడు ''బాహుబలి 2'' మాత్రం.. ఆ నిజం తెలుసుకోవాలనుకునే ఆడియన్స్ ను దారుణంగా చంపేస్తోంది. అసలు ఏమాత్రం సంకోచం లేకుండా జరుగుతున్న దోపిడీలో.. జనాలు షాకైపోతున్నారు అంతే.

మ్యాటర్ ఏంటంటే.. హైదరాబాద్ వంటి నగరాల్లో గురువారం రాత్రి 9 గంటలకు 10 గంటలకు అనే షోలు పడుతున్నాయి. అయితే ఈ షోల టిక్కెట్లు ఆన్ లైన్ బుక్కవ్వట్లేదు.. ధియేటర్ దగ్గర కౌంటర్ లో దొరకట్లేదు. మరి ఏమవుతున్నట్లు? ఏముంది.. కొంతమంది మా దగ్గర టిక్కెట్లున్నాయ్... ఒక్కోటి 1000 - 1500 అంటూ అమ్మేస్తున్నారు. అదేంటి బాసూ 150 రూపాయల టిక్కెట్ ను వెయ్యికి విక్రయిస్తున్నారని అడిగితే.. ధియేటరోళ్లే మాకు 600లకు ఇచ్చారు గురూ.. ఏం చేయమంటావ్ అంటున్నారు. ఈ విధంగా చూస్తుంటే.. జనాల్లో ఉన్న విపరీతమైన క్రేజ్ ను బాహుబలి డిస్ర్టిబ్యూట్ చేసిన వారు.. బయ్యర్లు.. ధియేటర్ ఓనర్లు.. బాగా ఉపయోగించుకుంటున్నారనే చెప్పాలి. మరి ఆ రేంజులో టిక్కెట్ అమ్మితే జనాలు కొంటున్నారా?

దాదాపు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా టిక్కెట్ రేటు 1000 రూపాయలు అనగానే.. వచ్చే వారం చూద్దాంలే అని తమ కుతూహలాన్ని చంపేసుకున్నారు. కాకపోతే ఈ ఫ్యాన్స్ ఉంటారు చూశారూ.. అబ్బే మాకు ఓకె అంటూ ఎగబడిపోతున్నారు. అలాగే ఇతర హీరోల అభిమానులు కూడా.. బెనిఫిట్ షో కోసం పెట్టట్లా.. ఇది కూడా అంతే అన్నట్లు వెయ్యి ఖర్చు పెట్టేస్తున్నారు. మరి గవర్నమెంటుకు ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చుగా? అంత టైమ్ ఎక్కడుందండీ బాబూ.. రాత్రికి షో పడాలి.. ధియేటర్లో మేం కాలు మోపాలి.. ఫేసుబుక్కులో మా పోస్ట్ పెట్టాలి అన్నట్లుంది యవ్వారం. #WhyBaahubaliKillingAudiences? #TicketRates

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/