Begin typing your search above and press return to search.

సురేష్ బాబు పై గుర్రుగా ఉన్న డిస్ట్రిబ్యూటర్లు - ఎగ్జిబిటర్లు..?

By:  Tupaki Desk   |   30 Jun 2021 3:30 AM GMT
సురేష్ బాబు పై గుర్రుగా ఉన్న డిస్ట్రిబ్యూటర్లు - ఎగ్జిబిటర్లు..?
X
థియేట‌ర్ రంగంలో డిస్ట్రీబ్యూష‌న్ - ఎగ్జిబిషన్ రంగంలో అగ్ర‌గామిగా ఉండే నిర్మాతల్లో దగ్గుబాటి సురేష్ బాబు ఒకరు. గత కొన్నేళ్లుగా వీటిపైనే వ్యాపారం చేస్తూ వస్తున్న స్టార్ ప్రొడ్యూసర్.. ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేయడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేశ్ బాబు నిర్మించిన మూడు సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. 'నారప్ప' 'విరాటపర్వం' చిత్రాలు ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా.. కరోనా పరిస్థితుల్లో వాయిదా పడ్డాయి. 'దృశ్యం 2' కూడా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరువుకుంటోంది. అయితే ఇప్పుడు 'నారప్ప' 'దృశ్యం 2' చిత్రాలను డైరెక్ట్ ఓటీటీ వేదికగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి.

'నారప్ప' చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో రిలీజ్ చేయడానికి.. 'దృశ్యం 2' సినిమాని డిస్నీ+హాట్ స్టార్ లో విడుదల చేయడానికి సురేష్ బాబు ఫ్యాన్సీ డీల్స్ చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని అంటున్నారు. దీంతో ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు.. థియేటర్స్ మీద ఆధారపడి జీవిస్తున్న వారు సురేష్ బాబు పై గుర్రుగా ఉన్నట్లు టాక్ నడుస్తోంది. థియేట్రికల్ రిలీజ్ కి సపోర్ట్ చేయాల్సిన సినీ పెద్ద‌.. ఇలా తాను నిర్మించిన సినిమాల్నే వ్యాపార ధ‌ర్మానికి విరుద్ధంగా డైరెక్ట్ ఓటీటీ విడుద‌ల‌కి సిద్ధం చేయడం ఏంటని ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నారట.

కరోనా పీక్స్ లో ఉన్నప్పుడు థియేటర్లు తెరిచే పరిస్థితి లేకపోవడంతో చాలా సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. అవి కూడా చిన్న సినిమాలే. పెద్ద సినిమాలన్నీ థియేట్రికల్ రిలీజ్ కే మొగ్గుచూపుతున్నట్లు థియేటర్స్ ఎప్పుడు తెరుచుకుంటాయా అని ఎదురు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణలో అనుమతులు వచ్చాయి. రేపోమాపో ఆంధ్రప్రదేశ్ లో కూడా పర్మిషన్స్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో సురేశ్ బాబు డిజిటల్ రిలీజ్ నిర్ణయం తీసుకోవడం ఏంటనేది డిస్ట్రిబ్యూటర్స్ ప్రశ్న.

'విరాటపర్వం' చిత్రాన్ని మాత్రం థియేటర్స్ లోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్న సురేష్ ప్రొడక్షన్స్ వారు.. 'నారప్ప' లాంటి పెద్ద సినిమాని ఓటీటీ రిలీజ్ చేయడంపై పలువురు ఆవేదన చెందుతున్నారట. చిన్న నిర్మాతలు ఆర్థిక భారంతో డైరెక్ట్ ఓటీటీకి వెళ్లడం ఆలోచించాల్సిన విషయం.. కానీ సురేష్ బాబు లాంటి అగ్ర నిర్మాత ఇలా చేయడం థియేటర్లను చంపేయడమే అని కామెంట్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన నిర్మాణాన్ని వ్యతిరేకించేలా ఇండైరెక్టుగా #SupportMovieTheatres #SaveCinema అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఈ పాండమిక్ లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ సోర్స్ ని సేవ్ చేయండి అంటూ క్యాంపెయిన్ చేస్తున్నారు.